1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (20:06 IST)

ఆస్ట్రేలియాతో భారత్ క్రికెట్ సిరీస్ : ఉచితంగా లైవ్ టెలికాస్ట్...

teamindia
భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ ప్రారంభంకానుంది. స్వదేశంలో జరిగే ఈ పోటీలను జియో సినియా ఉచితంగా లైవ్ టెలికాస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేసిన జియో సినిమా ఈ మేరకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఈ క్రికెట్ సిరీస్‌లో భాగంగా, ఈ నెల 22, 24, 27వ తేదీల్లో భారత్, ఆసీస్ మధ్య మూడు వన్డేలు జరుగుతాయి. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ ఇరు జట్లకు సన్నాహకంగా, కీలకంగా మారనుంది. మరోవైపు 2023 సెప్టెంబర్ నుంచి 2028 మార్చి వరకు భారత్‌లో జరిగే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ టోర్నీల ప్రసార హక్కులను జియో కంపెనీకి చెందిన వయాకామ్ 18 సొంతం చేసుకుంది.
 
అయితే, భారత్ - ఆస్ట్రేలియా సిరీస్ ప్రసారంతో ఐదేళ్ల కాలానికి ఈ హక్కులు మొదలవుతాయి. దాంతో, ఐపీఎల్ తరహాలో ఈ సిరీస్‌ను అందరికీ ఉచితంగా ప్రసారం చేయాలని జియో నిర్ణయించింది. మొత్తం 11 భాషల్లో ఈ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం కల్పించనుంది. హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, గుజరాతీ, భోజ్‌పురి, మరాఠీ, బెంగాలీ, పంజాబీ భాషల్లో ప్రసారం చేయనుంది.