శుక్రవారం, 28 జూన్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2023 (13:21 IST)

నేడు రెండో టీ20 మ్యాచ్ : బ్యాటింగే కీలకం

cricket ground
కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు ఆతథ్య వెస్టిండీస్ జట్టుతో రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా ఓడిపోయింది. దీంతో రెండో మ్యాచ్‌లో గెలుపుపై భారత్ కన్నేసింది. అయితే, తొలి మ్యాచ్‌లో బౌలర్లు రాణింపు ఎలా ఉన్నా.. స్టార్లతో కూడిన బ్యాటింగ్ లైనప్ స్లో పిచ్‌పై ఆడేందుకు తంటాలు పడింది. ఒక్క బౌండరీ తేడాతో ఓటమి పాలైంది. డెత్ ఓవర్లలో తడబాటు ఫలితాన్ని మార్చింది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం వెస్టిండీస్ రెండో మ్యాచ్‌లో ప్రతీకారం కోసం భారత జట్టు బరిలోకి దిగబోతోంది. అటు స్వల్ప స్కోరును కాపాడుకునే క్రమంలో బంతి వరకు విండీస్ బౌలర్లు పట్టు వదల్లేదు. చకచకా వికెట్లు తీస్తూ ఒత్తిడిలోకి నెట్టారు. కానీ పొట్టి ఫార్మాట్‌లో అదరగొట్టే విండీస్ బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. నేటి మ్యాచ్‌లో బ్యాటింగ్ విభాగం కూడా సత్తా చూపితే భారత్‌కు సవాల్ తప్పదు. 
 
ఇరు జట్ల అంచనా.. 
భారత్ : గిల్, ఇషాన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్, కుల్దీప్, చాహల్, ఆర్ట్దీప్, ముకేశ్ కుమార్. 
 
వెస్టిండీస్: మేయర్స్, కింగ్, చేజ్/చా ర్లెస్, పూరన్, హెట్మయెర్, పావెల్ (కెప్టెన్), హోల్డర్, షెఫర్డ్, హౌసేన్, జోసెఫ్, మెక్కాయ్ 
 
పిచ్, వాతావరణం
ఈ పిచ్ కూడా స్పిన్నర్లకు సహకరించవచ్చు. అలాగే ఉదయం పూట వర్షంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగే అవకాశం లేకపోలేదు.