శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (14:30 IST)

వన్డే ప్రపంచకప్ సిరీస్.. సంజూ శాంసన్‌కు జట్టులో చోటు లేదు..

Sanju Samson
పరిమిత 50 ఓవర్ల ప్రపంచకప్ సిరీస్ అక్టోబర్, నవంబర్‌లలో భారత్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ సహా 10 జట్లు పాల్గొంటున్నాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
 
భారత్ తన తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 5న చెన్నైలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ప్రపంచకప్‌కు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని జట్లూ సన్నద్ధమవుతున్నాయి.
 
ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. సంజూ శాంసన్‌కు జట్టులో చోటు దక్కలేదు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు.
 
ప్రపంచకప్‌కు భారత జట్టు:- రోహిత్ శర్మ,  శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సమీ, మహ్మద్ సిరాజ్, బుమ్రా శార్దూల్ ఠాగూర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అక్సర్ పటేల్