శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (15:32 IST)

నవంబర్ 2020లో మార్కెట్‌లోనికి రానున్న ఎథర్ 450X

భారతదేశంలోని మొదటి స్మార్ట్ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీదారుల్లో ఒకరైన ఎథర్ ఎనర్జీ, నవంబర్ 2020లో తన 125 సిసికేటగిరీలో అత్యంత వేగవంతమైన స్కూటర్‌ల్లో ఒకటైన ఎథర్ 450Xని లాంఛ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. 2021 మొదటి త్రైమాసికంనాటికి ఇంతకు ముందు ప్రకటించినట్లుగా మొత్తం 9 నగరాల్లో అంటే బెంగళూరు, చెన్నై, హైద్రాబాద్, ముంబై, పూణే, ఢిల్లీ, అహ్మదాబాద్, కొచ్చి మరియు కోయంబత్తూరు రోడ్లపై ఎథర్ 450Xని చూడవచ్చు. దశలవారీగా ముందుగా బెంగళూరు మరియు చెన్నై ఆ తరువాత మిగిలిన నగరాల్లో డెలివరీ చేయబడుతుంది.
 
టెస్ట్ రైడ్‌ల  ద్వారా ఎథర్ 450Xకు సంబంధించిన వినియోగదారుల అభిప్రాయం మారుతుంది మరియు వాహనం యొక్క నిజమైన పనితీరును అనుభవించవచ్చు. వ్యక్తులు వేహికల్‌ పనితీరును అనుభూతి చెందడానికి, ఎథర్ అన్ని మార్కెట్‌ల్లో అక్టోబర్ నుంచి ఆన్ గ్రౌండ్ టెస్ట్ రైడ్‌‌లను విస్త్రృతంగా ప్రోత్సహిస్తుంది.
 
ఎథర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లు సెటప్ చేయడానికి ఎథర్ ఎనర్జీ కీలక మార్కెట్‌ల్లో ప్రీమియం పార్టనర్‌లతో భాగస్వామ్యం నెరుపుతోంది. పబ్లిక్ ఛార్జింగ్ కొరకు, ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ని ఎథర్ ఏర్పాటు చేస్తుంది. డెలివరీకి ముందు ఎథర్ నగరవ్యాప్తంగా గ్రిడ్‌ని ఏర్పాటు చేస్తుంది, తద్వారా కొత్త యజమానులకు వేహికల్ డెలివరీ చేసిన తరువాత ఎలాంటి అవాంతరం లేని అనుభవం కలుగుతుంది. ఫేజ్ 1లో ఎథర్ 10-15 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లకు తయారీలు చేస్తోంది. గ్రీన్ దీపావళి సెలబ్రేట్ చేసుకోండి మరియు ఎథర్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిక్‌కు మారండి.
 
నగరం టైమ్‌లైన్‌లు ఇలా వున్నాయి. బెంగళూరు, చెన్నై, హైద్రాబాద్, పూణేలలో నవంబర్ 2020 నుంచి ప్రారంభం అవుతుంది. కొచ్చిన్, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో నవంబర్, 2020 నుంచి ప్రారంభం అవుతుంది. ఢిల్లీ, ముంబైలలో డిసెంబర్ 2020 నుంచి ప్రారంభం అవుతుంది. కోయంబత్తూరు మరియు ఇతర నగరాలలో 2021 మొదటి త్రైమాసికం నుంచి ప్రారంభం అవుతుంది.
 
ఈ సందర్భంగా తరుణ్ మెహతా, కో ఫౌండర్ మరియు సిఈవో, ఎథర్ ఎనర్జీ కోట్ మాట్లాడుతూ.. ‘‘ఈ మహమ్మారి మా టైమ్‌లైన్‌లను కొన్ని నెలలు మాత్రమే మార్చగలిగింది, అయితే మేం ప్లాన్‌ను తిరిగి పట్టాలపైకి ఎక్కించగలుగుతున్నాం. మా విస్తరణ ప్లాన్‌ని రిఫైన్ చేయడానికి మేం ఈ సమయాన్ని ఉపయోగించుకున్నాం మరియు గో టూ మార్కెట్ స్ట్రాటజీని అందించబోతున్నాం.
 
సప్లై ఛైయిన్‌లో రిఫైన్ చేయడానికి మా సప్లయర్ పార్టనర్‌లతో మేం చాలా చురుగ్గా పనిచేస్తున్నాం. ఇక మేం ఎక్కువ కాలం వేచి ఉండలేం. మా డీలర్ నెట్‌వర్క్ మరియు ప్రతి నగరంలోని ఎథర్ గ్రిడ్‌ పాయింట్‌ల గురించి మేం త్వరలోనే మరింత సమాచారాన్ని అందిస్తాం. డిమాండ్ అసాధారణంగా ఉంది, మరియు విభిన్న యాజమాన్యత మరియు కొనుగోలు మోడల్స్ పరిచయం చేయడం ద్వారా వినియోగదారులు ఎలక్ట్రిక్‌కు చాలా వేగంగా మారతారని ఆశిస్తున్నాం. అద్భుతమైన సమయం ముందు ఉంది.”