1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 మే 2025 (12:16 IST)

దేశంలో ఏటీఎం‌లు మూడు రోజులు మూసివేత? ఫ్యాక్ట్ చెక్!!

atm cash
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం తీవ్రతరమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో రకరకాలైన వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇవి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ వార్త ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇండోపాక్ నేపథ్యంలో వచ్చే మూడు రోజుల పాటు ఏటీఎంలు మూతపడనున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ర్యాన్స‌మ్‌వేర్ సైబర్ దాడి జరగొచ్చని, అందుకే రెండు నుంచి మూడు రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఏటీఎంలను మూసివేస్తున్నట్టు ఆ న్యూస్ సారాంశం. ఈ మేరకు ఓ సందేశం ఇపుడు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది. 
 
అయితే, దీనిని పీబీఐ ఫ్యాక్ట్ చెక్ చేసి క్లార్టిటీ ఇచ్చింది. అది పూర్తిగా నకిలీ న్యూస్ అని తేల్చింది. ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. ఏటీఎంలు ఎప్పటిలాగానే పని చేస్తాయని వెల్లడించింది. ఎవరూ కూడా ఎలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయొద్దని, అస్సలు నమ్మవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించింది. ఇందుకు సంబంధించి వాట్సాప్‍లో షేర్ అవుతున్న ఫేక్ మెసేజ్‌ను కూడా షేర్ చేసింది.