గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (16:08 IST)

ఉద్యోగులకు బజాజ్ వరాలు: ఉద్యోగి మరణిస్తే రెండేళ్లు జీతం, కుటుంబ సభ్యులకు ఐదేళ్లు హాస్పిటలైజేషన్‌ బీమా ఖర్చు

బజాజ్‌ ఆటో నేడు దేశవ్యాప్తంగా కోవిడ్‌ 19 మహమ్మారి సెకండ్‌ వేవ్‌ దేశవ్యాప్తంగా విజృంభిస్తుండటంతో మరింతగా తమ ఉద్యోగులకు మద్దతునందించనున్నట్లు వెల్లడించింది. గత సంవత్సర కాలంగా ఇప్పటికే కంపెనీ ఆరంభించిన పలు కార్యక్రమాలకు అదనంగా ఈ తాజా పాలసీని వెల్లడించింది. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో అంతకన్నా ఎక్కువగా ఉద్యోగులకు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనని కోవిడ్‌ వెల్లడించింది. ఉద్యోగులు ఇప్పుడు సమగ్రంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
 
తాము తీసుకున్న పలు కార్యక్రమాలను గురించి రాజీవ్‌ బజాజ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, బజాజ్‌ ఆటో మాట్లాడుతూ, ‘‘మనం ఇతరులను ఏవిధంగా గౌరవించాలి అని రమణ మహర్షిని అడిగినప్పుడు ఆయన ‘ఇక్కడ ఇతరులు అంటూ ఎవరూ లేరు’ అని అన్నారు. అందరూ ఒకటే అనే భావం దానిలో ఉంది. ఈ ఏకత్వపు భావనతోనే, ఈ మహమ్మారి నేపథ్యంలో తమ విధి నిర్వహణకు ఆవల, ప్రియమైన వారిని కోల్పోవడం వల్ల తమ సర్వస్వం కోల్పోయిన బజాజ్‌ ఆటో విస్తరించిన కుటుంబాల కోసం తాము తమ వంతు తోడ్పాటునందిస్తాం’’ అని అన్నారు.
 
ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం నగదు సహాయం
ఈ నూతన పాలసీ కింద, కోవిడ్‌ కారణంగా దురదృష్టవశాత్తు ఉద్యోగుల మరణం సంభవిస్తే అతను/ఆమె కుటుంబ సభ్యులు నగదు మద్దతును తమ ఆప్తులను కోల్పోయిన రెండేళ్ల వరకూ అందుకోగలరు. ఈ కంపెనీ ఇప్పుడు వారి మీద ఆధారపడిన చిన్నారుల విద్య కోసం కూడా మద్దతును అందించనుంది. చిన్నారులు తామెంచుకున్న రంగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసే వరకూ ఈ మద్దతు అందిస్తుంది. దీనితో పాటుగా, మృత్యువాత పడిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఐదేళ్ల పాటు హాస్పిటలైజేషన్‌ బీమా ఖర్చును సైతం భరించనుంది.
 
ఉద్యోగులతో పాటుగా అధిక శాతం కమ్యూనిటీకి కోవిడ్‌ కేర్‌ మద్దతు:
కోవిడ్‌తో జరగుతున్న యుద్ధం పట్ల బజాజ్‌ ఆటో తమ నిబద్ధతను మొత్తంమ్మీద 300 కోట్ల రూపాయలను పలు ప్రభుత్వ, స్ధానిక యంత్రాంగం మరియు ఎన్‌జీవో కార్యక్రమాలకు అందించేందుకు మద్దతును తెలుపడం ద్వారా వెల్లడించింది. దీనిలో భాగంగా 12 ఆక్సిజన్‌ ప్లాంట్లను సమకూర్చడంతో పాటుగా గత సంవత్సరం మహమ్మారి ఆరంభమైన నాటి నుంచి పలు ఇతర శ్వాస సంబంధిత యంత్రసామాగ్రి సమకూర్చడం కూడా భాగంగా ఉన్నాయి.
 
ఆర్థిక తోడ్పాటుతో పాటుగా బజాజ్‌ ఆటో ఇప్పటికే పలు కోవిడ్‌ కేర్‌ సదుపాయాలలో  పరీక్షలు మరియు చికిత్స సదుపాయాలను ఆరంభించింది. ఇవన్నీ కూడా ప్రొఫెషనల్‌ మెడికల్‌ కేర్‌, 24 గంటల పర్యవేక్షణ కలిగి ఉన్నాయి. తమ ఇంజినీర్ల మద్దతును సైతం ఇది అందించింది. వీరు ప్రభుత్వ అధికారులతో అతి సన్నిహితంగా పనిచేయడంతో పాటుగా ఆక్సిజన్‌ వ్యవస్ధలను ఆడిట్‌ చేయడం చేస్తున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా 70కు పైగా ఆస్పత్రులలో  వీరు తనిఖీలు నిర్వహించడం ద్వారా ఈ అత్యంత విలువైన వనరులను వ్యర్థం కాకుండా కాపాడుతున్నారు.
 
కరోనా తొలి వేవ్‌ కాలంలో, ఈ కంపెనీ 32 పడకల సదుపాయాన్ని తమ ఆక్రుడీ ప్లాంట్‌లో ఆరంభించింది. ఎనిమిది భవంతులలో ఈ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ కోవిడ్‌ రోగులకు సుశిక్షితులైన డాక్టర్లు చికిత్సనందిస్తున్నారు. ఇది ఇతరకోవిడ్‌ కేంద్రాలు ఉన్నటువంటి వాలుజ్‌ (200 పడకలు), చకన్‌ (16 పడకలు), పంత్‌ నగర్‌ (15 పడకలు)కు అదనం. వీటిలో కొద్ది మొత్తం పడకలను కంపెనీ ఉద్యోగులు మరియు సిబ్బంది కోసం కేటాయించగా, మిగిలిన వాటిని సంబంధిత కమ్యూనిటీల అవసరాలను తీర్చేందుకు కేటాయించారు.
 
2020 జూన్‌ ఆరంభం నుంచి, 4400 పరీక్షలను అంతర్గతంగా కంపెనీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, కాంట్రాక్ట్‌ వర్క్‌మెన్‌కు సహాయపడేందుకు చేయడంతో పాటుగా కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ తొలిదశలో గుర్తించేందుకు కృషి చేశారు. ఇది పలు మున్సిపల్‌ కార్పోరేషన్స్‌తో సైతం భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా తమ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సినేషన్‌ వేయించనుంది.
 
కమల్‌నయన్‌ బజాజ్‌ హాస్పిటల్‌ పరిధి కింద వాలుజ్‌ హాస్పిటల్‌ను ఏర్పాటుచేశారు. ఈ కోవిడ్‌ కేర్‌ కేంద్రం 36 పడకల సదుపాయంగా జూన్‌ 2020లో  కార్యక్రమాలు ఆరంభించింది. అప్పటి నుంచి ఇది విస్తరిస్తూ 200 పడకల సదుపాయంగా మారింది. దీనిని బజాజ్‌ ఆటో యొక్క కార్మికులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఆరంభించినప్పటికీ ఇప్పుడు కేవలం ఉద్యోగులకు మాత్రమే కాకుండా ప్లాంట్‌ చుట్టుపక్కల కమ్యూనిటీకి కూడా సేవలను అందిస్తుంది.  ఈ సదుపాయంలో ఇప్పటి వరకూ 1140 మంది రోగులు కోలుకున్నారు.
 
వాలుజ్‌లో కార్యక్రమాలలో భాగంగా, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రంను జానకీ దేవి బజాజ్‌ ఫౌండేషన్‌ తరపున ఏర్పాటుచేశారు. దీనిని ఇటీవలనే ప్రారంభించారు. ఈ కంపెనీ, అకుర్దీ ఆస్పత్రితో పాటుగా పూనె మున్సిపల్‌ కార్పోరేషన్‌తో భాగస్వామ్యం చేసుకుని తమ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు మరియు ఎక్స్‌టెండెడ్‌ వర్క్‌ఫోర్స్‌ కోసం వ్యాక్సినేషన్‌ శిబిరాలను ఏర్పాటుచేసింది. వ్యాక్సిన్‌లను సమకూర్చుకోవడంకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిబంధనలకు అనుగుణంగా వ్యాక్సిన్‌ ప్రదాతలతో సైతం ఇది చర్చలు జరుపుతుంది.
 
బజాజ్‌ ఆటో యొక్క కార్యక్రమాలు కోవిడ్‌ 19తో పోరాడేందుకు సహాయపడనున్నాయి. ఇవి కేవలం వైద్య మౌలిక వసతుల సృష్టి పరంగా మాత్రమే పరిమితం కాదు , గత సంవత్సరం నుంచి రోజువారీ కూలీలకు మరియు అవసరమైన వారికి ఆహారం అందించడం ద్వారా ఎంతోమంది జీవితాలనూ స్పృశించింది. ఇది 7500 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడంతో పాటుగా ఎంఐడీసీ అభ్యర్ధనకు అనుగుణంగా తమ అకుర్దీ ప్లాంట్‌ నుంచి దానిని కొనసాగిస్తూనే ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు స్థానిక పోలీసులకు మోటర్‌సైకిల్స్‌ అందించడంతో పాటుగా ఆటో రిక్షా డ్రైవర్లకు లాక్‌డౌన్‌ సమయంలో ఆహార పొట్లాలనూ అందజేసింది.