బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 2 ఏప్రియల్ 2022 (18:07 IST)

‘కూల్స్‌ లైక్‌ ఐస్‌ లుక్స్‌ సో నైస్‌ ’: బజాజ్ ఎలక్ట్రికల్స్ నుంచి ఎయిర్‌ కూలర్స్‌

భారతదేశంలో సుప్రసిద్ధ కన్స్యూమర్‌ అప్లయెన్సెస్‌ బ్రాండ్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ ఇప్పుడు తమ శ్రేణి ఉత్పత్తుల ముఖ్యమైన ఆలోచన ‘కూల్స్‌ లైక్‌ ఐస్‌. లుక్స్‌ సో నైస్‌!’ చుట్టూ మల్టీమీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ నూతన టీవీసీ చిత్రం ద్వారా ఆహ్లాదకరమైన మరియు ఆకర్షణీయమైన వేసవి అనుభవాలను కోరుకుంటున్న భారతీయ వినియోగదారులను కనెక్ట్‌ కావడాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ తాజా శ్రేణి అత్యుత్తమంగా గదిని చల్లబరుస్తుంది. ఈ శ్రేణిలో గుడ్‌ డిజైన్‌ అవార్డు 2023 గెలుచుకున్న బజాజ్‌ టీఎంహెచ్‌-6 స్కైవ్‌ టవర్‌ ఏసీ కూలర్‌ కూడా ఉంది.

 
మెక్‌కాన్‌ వరల్డ్‌ గ్రూప్‌ ఇండియా నేపథ్యీకరించిన ఈ టీవీసీ సృజనాత్మకంగా ఓ డ్రోన్‌ కెమెరా అత్యంత అందమైన ల్యాండ్‌ స్కేప్స్‌ను అన్వేషిస్తూ వెళ్తుంటుంది. ఈ కెమెరా వ్యూ పర్వతాల మీదుగా ప్రారంభమై, మంచుతో కప్పబడిన చెట్లు,  ఆ పక్కనే ఉన్న పొడవైన లోయలు, భారీ మేఘాలను అన్వేషిస్తూ, గడ్డకట్టిన సరస్సులు మీదుగా కప్పబడిన పొగమంచు ద్వారా వెళ్తూ చివరకు విస్తృతశ్రేణి బజాజ్‌ కూలర్‌లను చూపుతుంది. ఈ ఆకర్షణీయమైన దృశ్యాలకు కవితాత్మక వాయిస్‌ ఓవర్‌ మద్దతునందిస్తూనే, అత్యున్నత శీతలీకరణ సాంకేతికత మరియు ఆధునిక డిజైన్‌ను అందించే నూతన శ్రేణి బజాజ్‌ ఎయిర్‌ కూలర్స్‌తో ఈ ఆకర్షణీయమైన విజువల్‌, చల్లటి , మంత్రముగ్థులను చేసే ప్రదేశాలను చూపుతుంది.

 
ఎయిర్‌కూలర్లు తక్కువ ఖర్చుతో ఉండటంతో పాటుగా భారతదేశంలో వేడిని అధిగమించేందుకు అత్యుత్తమ మార్గంగా ఉంటుంది. ఎయిర్‌కూలర్లను సాధారణంగా వెంటిలేషన్‌ అధికంగా ఉన్న గదులలో వాడతారు. ఇది గదిలోకి తాజా గాలికి తీసుకురావడంతోపాటుగా గదిని చల్లబరుస్తుంది  మరియు సౌకర్యవంతంగానూ మారుస్తుంది. గత రెండు  సంవత్సరాలుగా వినియోగదారులు అధికశాతం ఇళ్లలోనే గడుపుతుండటం వల్ల ఆకర్షణీయయైన హోమ్‌ అప్లయెన్సస్‌ కోసం డిమాండ్‌ పెరిగింది. ఈ వేసవిలో తప్పనిసరిగా ఉండాల్సిన అప్లయెన్సస్‌గా బజాజ్‌ ఎయిర్‌ కూలర్స్‌ నిలుస్తాయి.

 
ఈ బ్రాండ్‌ చిత్రం గురించి కృష్ణ రామన్‌, బిజినెస్‌ హెడ్‌- కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్- బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘మహమ్మారి కారణంగా తప్పనిసరై  వినియోగదారులు ఇళ్లలోనే గత రెండు సంవత్సరాలుగా గడుపుతున్నారు. అక్కడ వారు ఇంటిలో అత్యుత్తమ నాణ్యమైన జీవన ఆవశ్యకతను గుర్తించారు. ఇది పటిష్టమైన కార్యాచరణను కలిగి ఉన్న ఉత్పత్తుల సౌందర్య ఆకర్షణపై దృష్టిని పెంచడానికి దారి తీసింది. బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ వద్ద, మేము  ఈ వినియోగదారుల ప్రాధాన్యతల మార్పును గమనించడంతో పాటుగా అత్యుత్తమ ఉత్పత్తులను తీర్చిదిద్దాము. దీనికి నిదర్శనంగా మరియు రాబోతున్న వేసవి సీజన్‌ పురస్కరించుకుని మేము నూతనశ్రేణి ఎయిర్‌కూలర్లను విడుదల చేశాము. మా నూతన బ్రాండ్‌ చిత్రం ఈ ఉత్పత్తుల సౌందర్య అంశాలతో పాటుగా పనితీరు ప్రయోజనాలనూ తుది వినియోగదారులకు అందిస్తుంది. ఈ బ్రాండ్‌ చిత్రం ఖచ్చితంగా మా వినియోగదారులను ఆకట్టుకోవడంతో పాటుగా మా అత్యాధునిక ఉత్పత్తుల పట్ల ఆసక్తినీ  ఖచ్చితంగా పెంచుతుంది’’ అని అన్నారు.

 
అశీష్‌ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ క్రియేటివ్‌, మెక్‌కాన్‌ వరల్డ్‌ గ్రూప్‌ మాట్లాడుతూ, ‘‘చల్లటి ప్రదేశాలు మనసును ఆహ్లాదపరచడంతో పాటుగా తమ అందంతో ఆకట్టుకుంటాయి. బజాజ్‌ ఎయిర్‌ కూలర్‌ ప్రచార  ఆలోచన దీనినే ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా మండే వేసవిలో మీ ఇంటిలో సౌకర్యవంతమైన చల్లటి ప్రదేశాల అనుభూతిని పొందడం ఎంత  సులభమో ఇవి చూపుతాయి. మంత్రముగ్ధం చేసే దృశ్య కథనానికి అత్యంత ఆకర్షణీయమైన, సాంకేతిక ఆవిష్కరణలు నవీన తరపు వినియోగదారులను ఆకర్షించేలా రూపొందించబడ్డాయి’’ అని అన్నారు.

 
హోమ్‌ అప్లయెన్సస్‌లో అగ్రగామి బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌. వీరి విస్తృతశ్రేణి డెసర్ట్‌ కూలర్స్‌, టవర్‌, పర్సనల్‌ కూలర్స్‌ మరియు విండో కూలర్లు సౌకర్యవంతమైన వినియోగం, సులభమైన నిర్వహణ అందిస్తాయి. ఈ నూతన శ్రేణి ఎయిర్‌ కూలర్లు సాటిలేని రీతిలో గదిలో చల్లటి అనుభవాలను దీని యొక్క అత్యున్నత కూలింగ్‌ సామర్థ్యం, శక్తివంతమైన ఎయిర్‌ డెలివరీతో అందిస్తాయి. ఈ శ్రేణి 6690 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తుంది. ఇవి  ఆఫ్‌లైన్‌ రిటైల్‌ ఛానెల్స్‌ వద్ద మరియు షాప్‌ డాట్‌ బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ డాట్‌ కామ్‌ , ఇతర సుప్రసిద్ధ ఈ-కామర్స్‌ వేదికల వద్ద లభ్యమవుతుంది.