శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (23:03 IST)

5స్టార్‌ ఇంధన పొదుపు, సెల్ఫ్-క్లీన్‌ సాంకేతికతతో నూతన ఆకర్షణీయమైన కూల్‌ ఏసీ హైయర్‌

హోమ్‌ అప్లయెన్సస్‌, కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ విభాగంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న, మేజర్‌ అప్లయెన్సస్‌ విభాగంలో గత 13 సంవత్సరాలుగా నెంబర్‌ 1గా వెలుగొందుతున్న హైయర్‌ నేడు తమ విప్లవాత్మక 2022 శ్రేణి ఆకర్షణీయమైన కూల్‌ ఎయిర్‌ కండీషనర్స్‌ను విడుదల చేసింది.

 
ఇవి సమర్ధవంతంగా గాలి కాలుష్య కారకాలను తొలగించడంతో పాటుగా గదిలో ఉష్ణోగ్రతలను చల్లబరుస్తాయి. హైయర్‌ యొక్క ప్రతిష్టాత్మకమైన ఫ్రాస్ట్‌ సెల్ఫ్‌ క్లీన్‌ టెక్నాలజీ కలిగిన ఈ ఎలగెంట్‌ కూల్‌ ఎయిర్‌ కండీషనర్స్‌ను మీ గదిలో గాలిని 99.9% వరకూ తటస్ధీకరించే రీతిలో తీర్చిదిద్దారు.