బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (17:19 IST)

ప్రచారకర్తగా రణ్‌వీర్ సింగ్‌ను నియమించిన బాల్‌కృష్ణ ఇండస్ట్రీస్

భారతీయ మల్టీనేషనల్ గ్రూప్, ఆఫ్- హైవే టైర్ మార్కెట్లో అంతర్జాతీయ అగ్రగామి అయిన బాల్ కృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బీకేటీ) తన ప్రచారకర్తగా సూపర్ స్టార్ రణ్ వీర్ సింగ్‌ను నియమించింది. ఈ సందర్భంగా బాల్ కృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజీవ్ పొద్దార్ మాట్లాడుతూ, ‘‘యూత్ ఐకాన్ రణ్వీర్ సింగ్‌తో మా బ్రాండ్ భాగస్వామ్యాన్ని ప్రకటించేందుకు ఎంతగానో ఆనందిస్తున్నాం. కఠోర పరిశ్రమ, ఉత్కృష్టత సాధించడం ద్వారా ఆయన సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో నిలిచారు. అదే ఆయనను మా బ్రాండ్‌ను ప్రముఖంగా చాటిచెప్పేందుకు ప్రచారకర్తగా ఎంచుకునేలా చేసింది’’ అని అన్నారు.

 
‘‘బీకేటీ, రణ్వీర్ సింగ్‌లను వారి ధోరణుల్లో వ్యక్తిత్వం, వినూత్నతల కారణంగా ‘స్వతంత్రు’లుగా వ్యవహరిస్తుంటారు. ఈ లక్షణాలతో కూడిన వ్యక్తితో భాగస్వామ్యం మాకెంతో ఆనందదాయకం. మా ఉత్పాదనల గురించి భారతదేశ వ్యాప్తంగా అవగాహన పెంచడంలో రణ్వీర్ మాకు ఎంతగానో తోడ్పడుతారని మేం విశ్వసిస్తున్నాం. రాబోయే ఏళ్లలో విజయవంతమయ్యే భాగస్వామ్యం కోసం మేం ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.

 
బీకేటీ టైర్స్ ప్రచారకర్తగా తన పాత్ర గురించి రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ, ‘‘బీకేటీ టైర్స్‌కు ప్రాతినిథ్యం వహించడం మాకెంతో ఆనందదాయకం. కలసి వృద్ధిచెందడం అనేది వారి ఆశ యం. అది ప్రకాశవంతమైన, మెరుగైన భవిష్యత్ కోసం కలసి మార్పు చెందడాన్ని, వృద్ధి చెం దడాన్ని సూచిస్తుంది. అది నా మాదిరిగానే ఉంది. బీకేటీ ప్రపంచంతో, దాని విలువలతో అను బంధం నాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.