శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 అక్టోబరు 2021 (22:27 IST)

తమ ప్రచారకర్తగా భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మను ఎంచుకున్న ఇన్ఫినిటీ లెర్న్‌ బై శ్రీ చైతన్య

విస్తృత స్థాయి మార్కెట్‌ విస్తరణ ప్రణాళికలో భాగంగా,  ఇన్ఫినిటీ లెర్న్‌ బై శ్రీ చైతన్య తమ  ప్రచారకర్తగా  భారత క్రికెట్‌ జట్టు సభ్యుడు రోహిత్‌ శర్మను ఎంచుకుంది. ఈ స్టైలిష్‌ ఓపెనర్‌ ఇన్ఫినిటీ లెర్న్‌ యొక్క బహుళ మార్కెటింగ్‌ ప్రచారాలతో పాటుగా బ్రాండ్‌ కార్యకలాపాలకు ముఖచిత్రంగా ఉండనున్నారు. రోహిత్‌ శర్మతో భాగస్వామ్యం ద్వారా  ఈ కంపెనీ తమ బ్రాండ్‌ గుర్తింపును  మరింత శక్తివంతం చేసుకోవడంతో  పాటుగా భారతదేశంలో ఎక్కువ మంది కోరుకునే ఎడ్‌ టెక్‌ బ్రాండ్‌గా నిలువాలని  కోరుకుంటుంది. 
 
‘‘భారతదేశంలో  అగ్రశ్రేణి ఎడ్‌టెక్‌ బ్రాండ్లలో ఒకటిగా నిలుడానికి  ఇన్ఫినిటీ లెర్న్‌ ప్రయత్నిస్తుంది. రోహిత్‌ శర్మ యొక్క వ్యక్తిగత బ్రాండ్‌, ఇన్ఫినిటీ లెర్న్‌ యొక్క బ్రాండ్‌ విలువల యొక్క నమ్మకం, విజయంతో  మరింతగా ప్రతిధ్వనిస్తుంది. భావితరపు క్రికెటర్లకు  స్ఫూర్తిదాయకంగా ఉండటంతో పాటుగా ఓ చక్కటి రోల్‌ మోడల్‌గా రోహిత్‌ నిలుస్తారు.
 
వీటన్నిటికీ మించి అతని టీమ్‌ విజయానికి తగిన మార్గనిర్దేశనం చేయడంతో పాటుగా అత్యుత్తమ రోల్‌ మోడల్‌గానూ నిలుస్తారు. ఆయన చేసే పనిని పూర్తి నైపుణ్యంతో చేయడంతో పాటుగా తన టీమ్‌ విజయం సాధించేందుకు మెంటార్‌గా తగిన మార్గనిర్దేశనమూ చేస్తుంటారు. రోహిత్‌తో భాగస్వామ్యంతో శక్తివంతమైన బ్రాండ్‌ను నిర్మించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని ఉజ్వల్‌ సింగ్‌, సీఈవొ- ఇన్ఫినిటీ లెర్న్‌ బై శ్రీ చైతన్య అన్నారు.
 
ఈ భాగస్వామ్యం గురించి రోహిత్‌ శర్మ మాట్లాడుతూ ‘‘శ్రీ చైతన్య లాంటి సుప్రసిద్ధ సంస్థతో వారి డిజిటల్‌ అభ్యాస వేదిక ఇన్ఫిఇటీ లెర్న్‌ ద్వారా భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాను..’’ అని అన్నారు.