కరోనా వైరస్‌తో 2021 నాటికి 15కోట్ల మంది చేతిలో చిల్లిగవ్వ కూడా..?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రజలు నానా తంటాలు పడుతోంది. కరోనా కారణంగా ఇప్పటికే లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా సమయంలో పరిశ్రమలు మూతపడ్డాయి. తిరిగి తెరుచుకున్నప్పటికీ పరిమిత సంఖ్యలోనే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది.
2021 నాటికి ప్రపంచంలో 15 కోట్ల మంది జనాభా చేతిలో రూపాయి కూడా లేకుండా తీవ్రమైన దారిద్యాన్ని అనుభవిస్తారని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఉద్యోగాలు కోల్పోవడంతో ప్రపంచంలో పేదరికం మరింత పెరిగిపోతుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేస్తోంది.
వాక్సిన్ వస్తే పరిస్థితి అంతా తిరిగి మాములుగా మారిపోతుందని అనుకుంటున్నారని, కానీ, కరోనా తరువాత ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకున్న వ్యక్తుల జీవనం అద్భుతంగా ఉంటుందని, దాని గురించి పట్టించుకోని వ్యక్తుల జీవితం దారుణంగా మారిపోతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.