ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (09:06 IST)

మరిది మేలుకోరి... అరడజను కంపెనీలకు అనుమతి.. చిక్కుల్లో ఆమె...

ఐసిఐసిఐ బ్యాంక్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందా కొచ్చర్ క్విడ్‌ ప్రో కో ఆరోపణల్లో కూరుకునిపోయారు. బ్యాంకింగ్‌ రంగంలో శిఖరాగ్ర స్థాయిని చేరిన ఆమె... కొన్నేళ్లుగా కూడగట్టుకున్న ప్రతిష్ఠ మసకబారుతోంది.

ఐసిఐసిఐ బ్యాంక్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందా కొచ్చర్ క్విడ్‌ ప్రో కో ఆరోపణల్లో కూరుకునిపోయారు. బ్యాంకింగ్‌ రంగంలో శిఖరాగ్ర స్థాయిని చేరిన ఆమె... కొన్నేళ్లుగా కూడగట్టుకున్న ప్రతిష్ఠ మసకబారుతోంది. ఆమె భర్త దీపక్‌ కొచ్చర్ కంపెనీల్లో వీడియోకాన్‌ అధినేత వేణుగోపాల్‌ ధూత్‌ మాత్రమే కాకుండా మరికొన్ని కంపెనీలు కూడా ఇన్వెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. 
 
అలాగే, దీపక్‌ కొచ్చర్ సోదరుడు రాజీవ్‌ కొచ్చర్‌కు చెందిన ఎవిస్టా అడ్వైజరీకి అరడజను కంపెనీల ఫారెక్స్‌ రుణాల పునర్‌వ్యవస్థీకరణకు ఐసిఐసిఐ బ్యాంకు అనుమతినిచ్చినట్టుగా వచ్చిన వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారింది. సింగపూర్‌ కేంద్రంగా ఉన్న ఈ ఎవిస్టా అడ్వైజరీని చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ సోదరుడు రాజీవ్‌ కొచ్చర్ ప్రమోట్‌ చేశారు. గత ఆరేళ్లలో ఏడు కంపెనీలకు సంబంధించిన మొత్తం 170 కోట్ల డాలర్ల రుణ పునర్‌వ్యవస్థీకరణ డీల్స్‌లో ఎవిస్టాను సలహాదారుగా ఐసిఐసిఐ బ్యాంకు నియమించింది. 
 
జయప్రకాష్‌ అసోసియేట్స్‌, జయప్రకాష్‌ వెంచర్స్‌, జిటిఎల్‌ ఇన్‌ఫ్రా, సుజ్లాన్‌, జెఎస్‌ఎల్‌, వీడియోకాన్‌కు చెందిన రుణాల పునర్‌వ్యవస్థీకరణలో ఎవిస్టా అడ్వైజర్‌గా ఉంది. చందా కొచ్చర్ మరిది కావడం వల్లనే రాజీవ్‌ కంపెనీకి ఈ డీల్స్‌ లభించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఐసిఐసిఐ బ్యాంక్‌, ఎవిస్టా అడ్వైజర్స్‌ ఖండించాయి. మొత్తం ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో చందా కొచ్చర్‌కు చిక్కుల్లో పడ్డారు.