శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (15:39 IST)

మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ జాబితాలో బాలీవుడ్ నటి

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా మరోమారు వార్తల్లోకెక్కింది. ఇటు బాలీవుడ్‌లో అటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఫోర్బ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ జాబితాలో చోటుదక్కించుకుంది. ఈ యేడాది రిలీజ్ చేస

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా మరోమారు వార్తల్లోకెక్కింది. ఇటు బాలీవుడ్‌లో అటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఫోర్బ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ జాబితాలో చోటుదక్కించుకుంది. ఈ యేడాది రిలీజ్ చేసిన 100 మహిళల జాబితాలో.. ప్రియాంకా 97వ స్థానంలో నిలిచింది. 
 
సినీరంగంతో పాటు సమాజ సేవతో అందర్నీ ఆకర్షిస్తున్న ఈ క్యూటీ ఇప్పుడు దేశానికి మరింత గర్వకారణంగా మారింది. ప్ర‌పంచంలో 100 మంది శ‌క్తిమంత‌మైన మ‌హిళ‌ల జాబితాను ఫోర్బ్స్ మేగ‌జైన్ విడుద‌ల చేసింది. 
 
ఇందులో 32వ స్థానంలో నిలిచిన ఐసీఐసీఐ సీఈఓ చందా కొచ్చ‌ర్ దేశంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన మ‌హిళ‌గా నిలిచారు. ఇంకా ఈ జాబితాలో హెచ్‌సీఎల్ సీఈఓ రోష్ని నాడ‌ర్ మ‌ల్హోత్రా (57వ స్థానం), బ‌యోకాన్ ఛైర్‌ప‌ర్స‌న్ కిర‌ణ్ మజుందార్ షా (71), హిందుస్థాన్ టైమ్స్ గ్రూప్ చైర్‌ప‌ర్స‌న్ శోభ‌న భార‌తీయా (92), న‌టి ప్రియాంక చోప్రా (97) ఉన్నారు. 
 
కాగా, బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన ప్రియాంకా ఇప్పుడు అక్కడ కూడా పాపులర్ స్టార్‌గా మారింది. ఆమె 2003లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సుమారు 40 హిందీ చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది బేవాచ్‌తోనూ హాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నది. ఏబీసీ ఛానల్‌కు సంబంధించిన క్వాంటికో టీవీ సిరీస్‌లోనూ నటిస్తున్న ప్రియాంకా అమెరికా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ప్రియాంకా ఓ ప్రొడ్యూసర్‌గా కూడా మారింది.