గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (12:44 IST)

వ్యాపారులకు ఓ షాకింగ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్‌పై రూ.105 పెంపు

వ్యాపారులకు ఓ షాకింగ్ న్యూస్. దేశంలో హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధ‌ర పెరిగింది. మార్చి 1 నుంచి ఆ సిలిండర్ ధరపై రూ.105 పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. 
 
పెరిగిన ధరల కారణంగా 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీ, కోల్‌క‌తా, ముంబైలలో రూ.2,000 దాటింది. అలాగే, ఐదు కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధరను కూడా రూ.27 పెంచామ‌ని చ‌మురు సంస్థ‌లు తెలిపాయి.
 
ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,012, కోల్‌కతాలో రూ.2,089, ముంబైలో రూ.1962, చెన్నైలో రూ.2,185.5కి పెరిగింది. అలాగే, ఐదు కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.569కి పెర‌గ‌డం గ‌మ‌నార్హం.