శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2016 (11:07 IST)

ఎస్.బి.ఐ తీపి కబురు.. కస్టమర్లకు తీరనున్న చిల్లర కష్టాలు...

భారత స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు చిల్లర కష్టాలు తీరనున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా చిల్లర కష్టాలు తలెత్తిన విషయంతెల్సిందే. ఈ చిల్లర కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభు

భారత స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు చిల్లర కష్టాలు తీరనున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా చిల్లర కష్టాలు తలెత్తిన విషయంతెల్సిందే. ఈ చిల్లర కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థ అయిన ఎస్.బి.ఐ.. ప్రజలకు తీపి కబురు పంపింది. 
 
ఇకపై... ఏటీఎంలలో రూ.100... 500.. 1000.. 2000 నోట్లే కాదు.. రూ.20.. రూ.50 నోట్లు కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య ప్రకటించారు. అయితే ఇందుకు కాస్త సమయం పట్టనుంది. ఇప్పటివరకు ఇంత తక్కువ విలువైన కరెన్సీని ఏటీఎంలలో పంపిణీ చేయలేదని ఆవెు వివరించారు. ఏటీఎంల వద్దకు ప్రజలకు ఎగబడటం తగ్గిన తర్వాత తాము చిన్న నోట్లను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. 
 
ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సామాన్య ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎంత త్వరగా అమలులోకి వస్తే అంత త్వరగా తమ కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. ఎస్‌బీఐ కూడా వీలైనంత త్వరగా ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఏటీఎం సెంటర్ల దగ్గర రద్దీ తగ్గిన వెంటనే ప్రవేశపెట్టాలని ఎస్‌బీఐ యోచిస్తోంది.