మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 మే 2016 (10:45 IST)

ఇకపై ఒక్క ఫోన్‌కాల్‌తో వెయిటింగ్ టిక్కెట్ రద్దు.. ఎలా?

ఇకపై ఒకేఒక్క ఫోన్‌కాల్‌తో వెయిటింగ్ టిక్కెట్ రద్దు కానుంది. ఈ మేరకు భారతీయ రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 139 నంబరుకు ఫోన్ చేస్తే చాలు. లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రద్దు క్యాన్సిల్ అనే ఆప్షన్‌ను నొక్కినా కూడా సరిపోతుంది. అయితే ప్రయాణ సమయానికి కేవలం నాలుగు గంటల ముందు మాత్రమే ఈ వెయిటింగ్ టిక్కెట్ రద్దు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. 
 
ప్రస్తుతం ఇప్పటిదాకా కన్‌ఫర్మ్‌ అయిన టికెట్లను మాత్రమే 139 లేదంటే ఆన్‌లైన్‌ ద్వారా రద్దు చేసుకునే వెసులుబాటు ఉండేది. తాజాగా వెయిట్‌ లిస్ట్‌, ఆర్‌ఏసీ టికెట్లకూ ఆ వెసులుబాటు కల్పించారు. బుధవారం రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు ఈ కొత్త విధానాన్ని ప్రారంభించారు. రద్దు చేసుకున్న టికెట్ల డబ్బును ప్రయాణం ప్రారంభించే స్టేషన్‌ నుంచి గానీ, సమీపంలోని అధికారిక శాటిలైట్‌ ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టం కేంద్రం నుంచి గానీ తిరిగి పొందవచ్చని తెలిపారు.