శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (20:02 IST)

నాన్ వెజ్ టేస్ట్.. కానీ వెజ్ పిజ్జా.. డామినోస్ సూపర్ ఫుడ్

The Unthinkable Pizza
నాన్ వెజ్ టేస్ట్.. కానీ వెజ్ పిజ్జా డామినోస్ సూపర్ ఫుడ్ టేస్ట్ అదరగొడుతోంది. ఇది కూడా శాకాహార ప్రియులకు గుడ్ న్యూస్ వంటిదే. ప్రముఖ పిజ్జా కంపెనీ డామినోస్ సరిగ్గా అలాంటి పిజ్జానే ఆవిష్కరించింది. దానికి ది అన్‌థింకబుల్ పిజ్జా అని పేరు పెట్టింది. ఈ పిజ్జా నిజానికి చికెన్ లాంటి టేస్ట్‌ను కలిగి ఉంటుంది. కానీ దాన్ని మాత్రం పూర్తిగా వెజ్ పదార్థాలతో తయారు చేశారు.
 
పూర్తిగా వృక్ష సంబంధ ప్రోటీన్లతో డామినోస్ పిజ్జా వారు సదరు పిజ్జాను రూపొందించారు. దీంతో దేశంలోనే తొలి వృక్ష సంబంధ మాంసం పిజ్జాగా ఆ పిజ్జా గుర్తింపు పొందింది. అందులో వృక్ష సంబంధ ప్రోటీన్లు ఉంటాయి. కానీ చికెన్ తిన్నట్లు అనిపిస్తుంది. అందులో పూర్తిగా 100 శాతం వెజ్ పదార్థాలనే వాడడం విశేషం. అయితే ఈ పిజ్జా దేశంలోని అన్ని డామినోస్ స్టోర్‌లలో లభించడం లేదు. కేవలం ఢిల్లీ, ముంబై, బెంగళూరులలోనే ఈ కొత్త రకం పిజ్జాను ఆస్వాదించవచ్చు.