మహిళల కోసం ప్రత్యేకమైన సేవింగ్స్.. ఆ అకౌంట్ ఏంటంటే?

woman
woman
సెల్వి| Last Updated: శుక్రవారం, 20 నవంబరు 2020 (14:25 IST)
మహిళలకు ఓ బ్యాంక్ ప్రత్యేకమైన సేవింగ్స్ అకౌంట్ సర్వీసులు ఆఫర్ చేస్తోంది. కొన్ని బ్యాంకులు ఇప్పటికే మహిళల కోసం రుణాలపై వడ్డీ రేట్లలో అదనపు తగ్గింపు ప్రయోజనాన్ని కల్పిస్తున్నాయి. అయితే మహిళల కోసం సేవింగ్స్ అకౌంట్ సర్వీసులు ఆఫర్ చేస్తోంది ఈక్విటస్. ఈ బ్యాంక్ ఖాతాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బ్యాంక్ ఇండియన్ మహిళా క్రికెటర్ స్మృతి మందనాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

మహిళలు ఈ అకౌంట్ తెరవడం వల్ల పలు బెనిఫిట్స్ పొందొచ్చు. దేశీ రెండో అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ ప్రత్యేకమైన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఖాతా తెరిచిన వారికి అధిక వడ్డీరేటు లభిస్తుంది. 7 శాతం వడ్డీ వస్తుంది. అంతేకాకుండా మహిళలకు ఉచిత హెల్త్‌ చెకప్, మహిళా డాక్టర్లతో ఫోన్‌లో మాట్లాడే సదుపాయం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఉద్యోగం చేసే మహిళలు, వ్యాపారం చేసే వారు, సీనియర్ సిటిజన్స్, గృహిణి ఇలా ఎవరైనాసరే బ్యాంక్‌కు వెళ్లి ఈ ఖాతా తెరవొచ్చు. అంతేకాకుండా మహిళలకు పలు రకాల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. లాకర్లపై 25 నుంచి 50 శాతం వరకు చార్జీల తగ్గింపు ఉంటుంది.

గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేట్లలో తగ్గింపు కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ అకౌంట్‌కు మెయింటెనెన్స్ చార్జీలు కూడా పడవు. ఇంకా బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా షాపింగ్ చేస్తే రివార్డు పాయింట్లు కూడా పొందొచ్చు.



దీనిపై మరింత చదవండి :