సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 28 జూన్ 2022 (18:45 IST)

ఫిగారో బేబీను విడుదల చేసిన ఫిగారో ఆలీవ్‌ ఆయిల్‌

Figaro
భారతదేశంలో ఎక్కువమంది అభిమానించే బ్రాండ్‌లలో ఒకటైన ఫిగారో ఆలివ్‌ ఆయిల్‌  ఇప్పుడు ఫిగారో బేబీతో నూతన ఉత్పత్తి విభాగంలో ప్రవేశించింది. ఈ పూర్తి సరికొత్త ఫిగారో బేబీ మసాజ్‌ ఆయిల్‌ పైన చర్మసంబంధమైన పరీక్షలు చేయడంతో పాటుగా ప్రత్యేకంగా శిశువుల లేత చర్మం కోసం తీర్చిదిద్దారు. దీనితో చర్మపు తేమ వృద్ది చెందుతుంది. ఈ ఆయిల్‌ను పూర్తి సహజసిద్ధమైన సూత్రీకరణతో తీర్చిదిద్దారు. ఇది చర్మానికి తగు పోషణ అందించడంతో పాటుగా చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

 
నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసన్‌ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో, ఆలివ్‌ నూనెతో మసాజ్‌ చేసిన చిన్నారులలో అత్యుత్తమ మాయిశ్చరైజ్డ్‌ చర్మం కనిపించింది. శిశువుల తొలి దశలో మసాజ్‌ అనేది అత్యవసర భాగంగా నిలుస్తుంటుంది. ఈ మసాజ్‌తో శిశువుల కండరాలు బలోపేతం కావడంతో పాటుగా తల్లి-శిశువు నడుమ బంధం కూడా బలోపేతం అవుతుంది.

 
వినియోగదారుల అవసరాలు అర్ధం చేసుకోవడంతో పాటుగా వాటిని తీర్చే క్రమంలో  ఫిగారో ఇప్పుడు బేబీ కేర్‌ విభాగంలో ప్రవేశించింది. ఫిగారో తాజా ఆవిష్కరణ నవజాత శిశువుల చర్మ సంరక్షణ అవసరాలు తీరతాయి. ఈ ఉత్పత్తులను ఆలివ్‌ ఆయిల్‌  చక్కదనంతో తయారుచేయడంతో పాటుగా విటమిన్‌ ఇతో సమృద్ధి చేశారు. తద్వారా చర్మ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటుగా చర్మంకు అవసరమైన తేమ కూడా లభిస్తుంది.

 
ఫిగరోలో కంట్రీ మేనేజర్ - శిలాదిత్య సారంగి ఇలా అన్నారు, ‘‘భారతదేశంలో  ఫిగారో ఆలివ్‌ ఆయిల్‌ దేశవ్యాప్తంగా వినియోగదారులకు అత్యంత ప్రాధాన్యతా ఎంపికగా నిలిచింది. ఇప్పుడు ఫిగారో బేబీ కేర్‌ను విడుదల చేయడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాం. పారదర్శకత, అత్యున్నత నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండటంతో పాటుగా నమ్మదగిన ఉత్పత్తి, బ్రాండ్‌ కోసం వెదుకుతున్న వినియోగదారులను చేరుకునే క్రమంలో ఫిగారో బేబీ దృష్టి కేంద్రీకరించింది.

 
మసాజ్‌ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో తరాలుగా  సంప్రదాయబద్ధంగా దీనిని అనుసరిస్తున్నారు. ఫిగారో తమ వారసత్వంను నూతన విభాగంలో విస్తరించడానికి సిద్ధంగా ఉంది. శిశువులకు అత్యుత్తమ సంరక్షణ అందిస్తుంది’’అని  అన్నారు.