1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (12:52 IST)

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధర..

Gold Ornament
పసిడి రేటు పడిపోయింది. నిన్న పెరిగిన బంగారం ధర శనివారం భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో జూన్ 25న బంగారం ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.47,450(10 గ్రాములు)కు చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములు రూ.51,760 కు చేరింది.
 
కాగా నిన్నటి ధరలతో పోల్చుకుంటే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 200, అదేవిధంగా 24క్యారెట్ల బంగారం రేటు రూ. 230 తగ్గాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ 10 గ్రామలు బంగారంపై రూ. 200కుపైగా తగ్గడం గమనార్హం. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 0.09శాతం తగ్గుదలతో ఔన్స్‌కు 1828 డాలర్లకు క్షీణించింది. అయితే వెండి ధర మాత్రం పెరిగింది. 0.42 శాతంపైకి చేరింది. ఔన్స్ కు 21.13 డాలర్ల వద్ద కదలాడుతోంది. బంగారం ధర ఈ వారంలో 0.9శాతం మేర పడిపోయింది.