1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జూన్ 2022 (11:00 IST)

మగువలకు గుడ్ న్యూస్.. పడిపోయిన పసిడి ధరలు

gold
మగువలకు గుడ్ న్యూస్. బంగారం ధర పడిపోయింది. పసిడి రేటు వరుసగా రెండో రోజు కూడా వెలవెలబోయింది. జూన్ 16న హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రూ. 270 పడిపోయింది. దీంతో పసిడి రేటు రూ. 51,440కు తగ్గింది. ఇంకా 22 క్యారెట్ల బంగారం రేటు అయితే రూ. 250 దిగొచ్చింది. 10 గ్రాములకు రూ. 47,150కు క్షీణించింది. 
 
ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,150 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,440గా నమోదైంది. 
 
విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,150 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,440గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.
 
అలాగే ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 60,000 ఉండగా, ముంబైలో రూ.60,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, విజయవాడలో రూ.66,000 వద్ద కొనసాగుతోంది. 
 
విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.