శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (10:06 IST)

"చంద్రన్న భరోసా" టూర్.. నేటి నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన

chandrababu
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, ఆయన జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ బస్సు యాత్రకు "ఎన్టీఆర్ స్ఫూర్తి - చంద్రన్న భరోసా" అని నామరణం చేయగా, తొలిరోజు యాత్ర అమలాపురం నుంచి ప్రారంభమవుతుంది. 
 
అంతేకాకుండా, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లోభాగంగా, పలు జిల్లాల్లో మినీ మహానాడుల పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహించేలా టీడీపీ నేతలు ప్లాన్ చేశారు. ఈ జిల్లాల పర్యటనల్లో భాగంగా, ప్రతి జిల్లాలో మూడు చొప్పున టీడీపీ మినీ మహానాడులను నిర్వహిస్తారు. 
 
అలాగే, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. మూడో రోడు ప్రజా సమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడు‌పై రోడ్డు షోలు నిర్వహించేలా ఈ టూర్ షెడ్యూల్ ఖరారు చేశారు. ముఖ్యంగా, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కల్పిస్తూ వారిని ఉత్తేజపరిచేలా చంద్రన్న భరోసా యాత్ర కొనసాగనుంది.