శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (20:20 IST)

కరోనా కాలం.. జీడీపీపై ఎఫెక్ట్.. 23.9 శాతం మేర ప్రతికూలత

GDP
కరోనా మహమ్మారి కారణంగా దేశ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. కరోనా కారణంగా ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. ఉపాధి కోల్పోయిన వారెందరో వుండగా.. అన్నం లేకుండా పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో ప్రస్తుత (2020-21) ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు దారుణంగా పతనమైంది. 
 
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 23.9 శాతం మేర ప్రతికూలత నమోదైంది.. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాల్లో ప్రతిష్టంభన చోటుచేసుకుంది. దీంతో వృద్ధి రేటు దశాబ్దాల కనిష్టానికి చేరుకుంటుందని ఇప్పటికే ఆర్థిక నిపుణులు అంచనా వేశారు.
 
ఈ అంచనాలకు అనుగుణంగానే వృద్ధిరేటు దారుణంగా పడిపోయింది. స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 23.9 శాతం మేర వృద్ధిరేటు క్షీణించింది.

కాగా... 1996లో క్వార్టర్ జీడీపీ లెక్కలు ప్రారంభించినప్పటి నుండి మొదటిసారి దారుణ క్షీణత నమోదు చేస్తుందని ఆర్థికవేత్తలు ముందు నుంచే చెప్తున్నారు.