మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 26 మే 2022 (19:06 IST)

ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌తో బాధపడుతున్న రోగులకోసం గ్లెన్‌మార్క్ ‘హలో స్కిన్‌’ ఆవిష్కరణ

Hello Skin
ఆవిష్కరణల ఆధారిత అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (గ్లెన్‌మార్క్‌) ఇప్పుడు డిజిటల్‌ పేషంట్‌ ఎడ్యుకేషన్‌ ఉపకరణం ‘హలో స్కిన్‌’ను ఐఏడీవీఎల్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. భారతదేశంలో డెర్మటోఫైటోసిస్‌ (రింగ్‌ వార్మ్‌ లేదా టినియా)తో బాధపడుతున్న రోగులు తమకు సూచించబడిన చికిత్సకు కట్టుబడి ఉండేలా ఇది తోడ్పడుతుంది.

 
మొట్టమొదటి వాట్సాప్‌ ఆధారిత చాట్‌ బాట్‌ హలో స్కిన్‌. ఇది రోగులకు పూర్తి అనుకూలంగా ఉండటంతో పాటుగా ఆరు ప్రాంతీయ భాషలలో ఇది లభ్యమవుతుంది. దీని గురించి గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌, ఇండియా ఫార్ములేషన్స్‌ అలోక్‌ మాలిక్‌ మాట్లాడుతూ, ‘‘మెరుగైన వ్యాధి వ్యాధి నిర్వహణ కోసం డిజిటల్‌ పేషంట్‌ చేరిక ఆరోగ్య సంరక్షణలో ముందుకు వెళ్లే మార్గం.‘ హలో స్కిన్‌’ అనేది ఈ దిశగా చేపట్టిన ఓ కార్యక్రమం. వ్యాధి పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా ఫంగల్‌ థెరఫీ పట్ల రోగి కట్టుబడి ఉండేలా చేస్తుంది. గ్లెన్‌మార్క్‌తో కలిసి ఐఏడీవీఎల్‌ ఈ వినూత్న పరిష్కారం తీర్చిదిద్దడమనేది డెర్మటాలజిస్ట్‌లు, రోగుల నడుమ విశ్వసనీయత పెంచుతుంది’’ అని అన్నారు.

 
ఐఏడీవీఎల్‌ అధ్యక్షులు డాక్టర్‌ రష్మీ సర్కార్‌ మాట్లాడుతూ, ‘‘ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ నిర్వహణలో చికిత్సకు కట్టుబడటం కీలకం. ఈ విషయంలో హలోస్కిన్‌ తోడ్పడుతుంది’’ అని అన్నారు. ఐఏడీవీఎల్‌  కో-ఆర్డినేటర్‌, డాక్టర్‌ మంజునాథ్‌ షెనాయ్‌ మాట్లాడుతూ, ‘‘ఈ రింగ్‌ వార్మ్‌ చికిత్సకు కట్టుబడి ఉండటం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చు.ఈ నూతన చాట్‌బాట్‌ రోగులకు సహాయపడే సరికొత్త మార్గం’’ అని అన్నారు.