1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మే 2022 (09:42 IST)

దేశంలో పసిడి ధరలకు మళ్లీ రెక్కలు

Gold Ornament
దేశంలో పసిడి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. దీంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. బుధవారంతో పోల్చితే గురువారం వీటి ధరల్లో తేడా కనిపించింది. నిజానికి గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. కానీ ఇపుడు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. 
 
గురువారం నాటి బులియన్ మార్కెట్ రేట్ల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52250గా ఉంది. అంటే బుధవారం నాటి ధరతో పోల్చితే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.150, 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.160 మేరకు పెరిగింది. అలాగే, దేశీయంగా కూడా వెండి ధరల్లో మార్పులు కనిపించాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.400 మేరకు పెరిగింది. ఫలితంగా కేజీ వెండి ధర రూ.62000గా ఉంది. 
 
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే, ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరూ.47900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52250గా వుంది. 
 
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరూ.47900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52250గా వుంది. 
 
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరూ.48370గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52770గా వుంది. 
 
బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరూ.47900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52250గా వుంది. 
 
తిరువనంతపురంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరూ.47900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52250గా వుంది. 
 
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరూ.47900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52250గా వుంది. 
 
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరూ.47900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52250గా వుంది.