బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మే 2022 (12:15 IST)

టీ24 టికెట్‌ ధర పెంపు.. రూ.100 నుంచి రూ.120కి అప్

tsrtc
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి బ్యాడ్ న్యూస్. ఇకపై రూ.100 చెల్లించి గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో 24 గంటలు ఎక్కడికైనా ప్రయాణించే టీ24 టికెట్‌ ధరను ఆర్టీసీ పెంచింది. దాన్ని రూ.120కు పెంచుతూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
 
శుక్రవారం నుంచి పెంచిన ధర అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఇటీవల టికెట్లు, పాస్​ల ధరలు కూడా పెరిగాయని, దీంతోనే టీ24 టికెట్‌ చార్జీని పెంచినట్లు ఆర్టీసీ తెలిపింది.
 
గతంలో పలు సందర్భాల్లో ఈ టికెట్‌పై 20 శాతం డిస్కౌంట్‌ ఇవ్వడంతో మంచి ఆదరణ లభించిందని, డిస్కౌంట్‌ ఎత్తేశాక కూడా ప్రయాణికుల ఆదరణ తగ్గలేదన్నారు.