బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (10:14 IST)

భారీగా పెరిగిన బంగారం ధరలు: రూ.200 పెరిగింది..

బంగారం ధర పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం 45,200గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.200 పెరిగింది. నగరంలో ఒక్క గ్రాము బంగారం ధర రూ.4,520 పలుకుతోంది. ఇక కేజీ బంగారం రూ.45,11,000కి లభిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో రూ.49,310గా ఉంది. నిన్నటిలో పోల్చితే రూ.210 పెరిగింది. నగరంలో ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రేటు రూ.4,931 పలుకుతోంది. 
 
స్వచ్ఛమైన బంగారం కేజీ ధర రూ.49,21,00,00గా ఉంది.  తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో ధరలు ఒకేలా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర 45,450గా ఉంది. ముంబైలో 47,250, న్యూఢిల్లీలో 47,350, కోల్‌కతాలో 47,650, బెంగళూరులో 45,200, కేరళలో 45,220గా ఉంది.