గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (11:17 IST)

గ్యాస్ సిలిండరుపై రూ.300 నగదు రాయితీ

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు వంట గ్యాస్ సిలిండర్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. వాణిజ్య సిలిండర్ ధర అయితే చుక్కలను తాకుతుంది. అలాగే, సాధారణ వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా వెయ్యికి చేరువైంది. ఇది సామాన్య ప్రజలకు పెనుభారంగా మారింది. ఈ నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండరుపై రూ.300 వరకు రాయితీ ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 
కొంతకాలం క్రితం వరకు రూ.594కు లభించిన డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.834 ధరకు కొన్ని చోట్ల లభిస్తుండగా మరికొన్ని చోట్ల రూ.1000 వరకు పలుకుతోంది అయితే, గతంలో వచ్చే నగదు రాయితీని కేంద్రం అమాంతం తగ్గించింది. ఇపుడు కేవలం రూ.20 లేదా రూ.30 మాత్రమే వస్తుంది. అయితే, ఇపుడు రూ.300 వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. 
 
అదెలాగంటే... సబ్సీడీ ఖాతాను ఆధార్ నంబరుతో లింక్ చేయడం వల్ల ధరల పెంపు వల్ల సామాన్య ప్రజానీకానికి ఉపశమనం కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా గరిష్ట ప్రయోజాలు పొందవచ్చని పేర్కొంది. గతంలో రూ.174 నగదు సబ్సీడీ ఇస్తుండగా ఇపుడు ఈ మొత్తాన్ని రూ.312కు పెంచింది. అయితే, గ్యాస్ నంబరును విధిగా ఆధార్ నంబరుతో అనుసంధానం చేయాల్సి వుంటుంది.