ఆరోక్య బ్రాండ్ కింద పన్నీర్‌ను విడుదల చేసిన హట్సన్ ఆగ్రో ప్రోడక్ట్ లిమిటెడ్
భారతదేశంలో సుప్రసిద్ధమైన ప్రైవేట్ రంగ డెయిరీ కంపెనీ, హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ (హెచ్‌ఏపీ) తమ విస్తృత శ్రేణి డెయిరీ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా అత్యంత రుచికరమైన నూతన జోడింపుగా ఆరోక్య పన్నీర్‌ను విడుదల చేసింది. ఆరోక్య పన్నీర్‌ను తాజా పాలతో తయారు చేశారు. ఈ పాలను నేరుగా రైతులు నుంచి సేకరించడంతో పాటుగా సహజసిద్ధమైన నిమ్మను వినియోగించారు. ప్రపంచ శ్రేణి పరిశుభ్రతా వాతావరణంలో అత్యున్నత శ్రేణి ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారులకు తగినట్లుగా ఈ ఉత్పత్తులు ఉంటాయి.
ఆరోగ్యవంతమైన పాల ఉత్పత్తులను తయారుచేయడాన్ని ఎప్పుడూ హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ గర్వంగా భావిస్తుంటుంది. సహజసిద్ధమైన, సంప్రదాయ పద్ధతిలో నిమ్మ వినియోగించి పన్నీర్ తయారుచేయడానికి ప్రాధాన్యతనిస్తున్న వినియోగదారుల అవసరాలను ఆరోక్య పన్నీర్ తీర్చనుంది. ఆరోక్య పన్నీర్, ఓ వినూత్నమైన ఆఫరింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే, పాలను విడగొట్టేందుకు ఇది సహజసిద్ధమైన నిమ్మరసం వినియోగించుకుంటుంది. సంప్రదాయ రీతిలో చేయడం వల్ల పన్నీర్ టెక్చర్ మృదువుగా ఉంటుంది మరియు విభిన్నమైన వంటకాల తయారీకి సైతం అనువుగా ఉంటుంది.
హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ ఛైర్మన్ ఆర్‌జీ చంద్రమోగన్ మాట్లాడుతూ, అత్యున్నత నాణ్యత కలిగిన పాల, పెరుగులకు ప్రతిరూపంగా ఆరోక్య బ్రాండ్ నిలుస్తుంది. లక్షలాది మంది వినియోగదారులకు ఇది ప్రాధాన్యతా బ్రాండ్. మా పాల ఉత్పత్తుల విభాగాన్ని విస్తరించడంలో అతి ముఖ్యమైనదిగా ఆరోక్య పన్నీర్ నిలుస్తుంది అని అన్నారు
ఆరోక్య పన్నీర్‌ను తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, గోవా, మహారాష్ట్ర, పాండిశ్చేరిలలో విడుదల చేశారు. ఈ ఉత్పత్తి 200 గ్రాముల ప్యాక్‌లో 100 రూపాయల ధరలో లభిస్తుంది. సహజసిద్ధమైన పదార్థాలు, ఆరోగ్యవంతమైన ప్యాకేజీ కలిగిన ఆరోక్య పన్నీర్‌తో, వినియోగదారులు రుచికరమైన, ఆరోగ్యవంతమైన, పోషకాలతో కూడిన పన్నీర్ రెసిపీలను తమ ఇంటిలోనే సౌకర్యవంతంగా చేసుకోవచ్చు.