ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (22:08 IST)

100వ స్టోర్‌ను ప్రారంభించిన హియరింగ్ కేర్ ప్రొవైడర్ హెర్‌జాప్

Hearzap
అత్యుత్తమ వినికిడి సంరక్షణ పరిష్కారాలకు ప్రసిద్ధి చెందిన హెర్‌జాప్, తమ 100వ స్టోర్‌ను జూబ్లీహిల్స్‌లో వైభవంగా ప్రారంభించింది. హెర్‌జాప్ యొక్క "100వ ఫ్లాగ్‌షిప్ స్టోర్"ని సిమెన్స్ హియరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇన్క్ మాజీ సీఈఓ శ్రీ S.K. శర్మ, హెర్‌జాప్  వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజా ఎస్‌తో కలిసి ప్రారంభించారు. ఆర్థిక సంవత్సరం 2026 నాటికి 250 స్టోర్‌లను, భవిష్యత్తులో 500 స్టోర్స్‌ను భారతదేశం అంతటా ఏర్పాటు చేయాలని బ్రాండ్ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వినికిడి ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకు రానుంది.
 
ఆడియోలజిస్ట్, హెర్‌జాప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజా ఎస్ మాట్లాడుతూ, "భారతదేశంలో వినికిడి సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే  మా అచంచలమైన అంకితభావానికి, నిబద్ధతకు నిదర్శనంగా 100వ స్టోర్‌ ప్రారంభోత్సవం నిలుస్తుంది. వినియోగదారులకు సమగ్రమైన, ఇంటరాక్టివ్ విధానాన్ని అందించడానికి మా దుకాణాలు రూపొందించబడ్డాయి" అని అన్నారు. 
 
హై-ఎండ్ వినికిడి సంరక్షణ పరిష్కారాలను అందించడంలో 47 సంవత్సరాల వారసత్వంతో, హెర్‌జాప్ యొక్క "హియరింగ్ ఎక్సపీరియన్స్ స్టోర్స్" సాంప్రదాయ వినికిడి క్లినిక్‌లను పునర్నిర్వచించాయి. ప్రతి స్టోర్ అసెస్‌మెంట్‌ల నుండి నెక్స్ట్-జెన్ హియరింగ్ ఎయిడ్స్ వరకు, ఆడియోలజిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన కన్సల్టేషన్ల వరకు సమగ్రమైన సేవలను అందిస్తుంది. దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు, ఆగ్నేయంలో ఛత్తీస్‌గఢ్, నైరుతిలో మహారాష్ట్ర, తూర్పున పశ్చిమ బెంగాల్‌తో సహా ఎనిమిది రాష్ట్రాల్లోని 100 స్టోర్‌లలో 150 మంది ఆడియోలజిస్ట్‌ల బృందంతో, హెర్‌జాప్ ఖాతాదారుల 'వినికిడి సంరక్షణ ప్రయాణంలో ప్రతి అంశానికి ఖచ్చితమైన శ్రద్ధను నిర్ధారిస్తుంది. 
 
హియరింగ్ సొల్యూషన్స్ ప్రై.లి. నిర్వహిస్తున్న హెర్‌జాప్, 2026 నాటికి 250 స్టోర్‌లను ప్రారంభించడం, 500 మంది ఆడియోలజిస్ట్‌లను ఆన్‌బోర్డింగ్ చేయడం లక్ష్యంగా చేసుకుంది.