1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (11:45 IST)

హోండా ఈ-స్కూటర్లు... త్వరలోనే మార్కెట్‌లోకి..

honda evehicle
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. అనేక కంపెనీలు ఈ స్కూటర్లను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా కూడా ఈ-స్కూటర్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 
 
హోండా టూవీలర్స్ భారతీయ అనుబంధ సంస్థ అయిన హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా లిమిటెడ్, దేశీయ మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను 2023 లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.
 
ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి మెయిన్‌స్ట్రీమ్ ఈవీ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో రాణిస్తుండగా, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ వంటి ట్రెడిషనల్ టూవీలర్ కంపెనీలు కూడా ఈవీ రంగంలోకి ప్రవేశించాయి. 
 
తాజాగా, హీరో మోటోకార్ప్ కూడా వచ్చే నెలలో తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పుడు, ఈ జాబితాలో హోండా మోటార్‌సైకిల్ కంపెనీ కూడా వచ్చి చేరింది. అయితే, హోండా బ్రాండ్ తొలి ఉత్పత్తిని రోడ్లపై చూడాలంటే మాత్రం 2023 వరకూ ఆగాల్సిందేనని ఆ కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.