శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 6 జనవరి 2021 (20:25 IST)

మదుపరులుగా మారమని పొదుపరులను కోరుతున్న ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌

ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ మదుపరుల అవగాహన ప్రచారం ‘పైసోం కో రోకో మత్‌’ను ఆరంభించినట్లు వెల్లడించింది. పొదుపరులను మదుపరులుగా మారమని దీనిద్వారా కోరుతుంది. ఈ ప్రచారం కోసం తాజా, సంప్రదాయేతర విధానాన్ని ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ అనుసరించడంతో పాటుగా సంప్రదాయం నుంచి సమకాలీనానికి సంపద సృష్టి సంభాషణను మార్చింది.
 
విశాల్‌ కపూర్‌, సీఈవొ- ఐడీఎఫ్‌సీ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌(ఏఎంసీ) మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో పొదుపు సంస్కృతి గణనీయంగా చొచ్చుకుపోయి ఉంది. ఇప్పటికీ మన పొదుపులో అధికభాగం సంప్రదాయ పెట్టుబడి పథకాలలో నిశ్చలంగా ఉండిపోతుంటాయి. చాలాసార్లు, ఈ తరహా పెట్టుబడులు మనకు జీవితకాలంలో అవసరమైన సంపదను సృష్టించలేవు.
 
వృద్ధి చెందుతున్న జీవన ప్రమాణాలలో, ఈ పొదుపరులకు తమ పెట్టుబడి ప్రాధాన్యతలను ఆధునీకరించుకునే అవకాశం ఉంది. మా తాజా ప్రచారం ‘పైసోం కో రోకోమత్‌’ వినూత్నమైన క్యారక్టరైజేషన్‌ను అమలు చేస్తోంది మరియు సృజనాత్మక స్టోరీ బోర్డ్‌ ఇప్పుడు పొదుపరులను తమ జడత్వం వదలాల్సిందిగా కోరుతూనే తమ పెట్టుబడుల కోసం ఆధునిక, స్మార్ట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అవకాశాలను అన్వేషించాల్సిందిగా కోరుతుంది’’ అని అన్నారు.
 
గౌరబ్‌ పరిజా, హెడ్‌–సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, ఐడీఎఫ్‌సీ ఏఎంసీ మాట్లాడుతూ ‘‘పైసోం కో రోకో మత్‌ ప్రచార ప్రధాన ఆలోచన, మన జీవితాల నుంచి ప్రేరణ పొందుతుంది. ఇక్కడ జడత్వం అనేది మన ఎదుగుదలకు అవరోధంగా మారడంతో పాటుగా కొన్నిసార్లు అది మనం చేసే నగదు కేటాయింపులో సైతం ప్రతిబింబిస్తుంది. ఈ క్యాంపెయిన్‌ ద్వారా మేము సంప్రదాయ మార్గాలకు ఆవల మీ నగదును వృద్ధి చేసుకునే అవకాశాలను చూడమనే బలీయమైన సందేశాన్ని అందిస్తున్నాం.  మీ నగదును విభిన్నమైన ఆస్తి తరగతులతో పాటుగా పెట్టుబడి పరిష్కారాలలో సైతం కేటాయించాల్సిందిగా వెల్లడిస్తున్నాం’’ అని అన్నారు.
 
2000వ సంవత్సరంలో ఏర్పాటైన ఐడీఎఫ్‌సీ ఏఎంసీ 1,20,000 కోట్ల రూపాయల ఆస్తుల నిర్వహణతో టాప్‌ 10 ఎస్సెట్‌ మేనేజర్లలో ఒకటిగా నిలిచింది. నవంబర్‌ 2020 నాటికి 55 మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలలో ఈ ఆస్తులు ఉన్నాయి. అనుభవజ్ఞులైన పెట్టుబడుల బృందం ఇది కలిగి ఉంది. భారతదేశవ్యాప్తంగా 250 నగరాలు, పట్టణాలలో ఇన్వెస్టర్లు ఉన్నారు. ఐడీఎఫ్‌సీ ఏఎంసీ ఇప్పుడు పొదుపరులను మదుపరులుగా మార్చడంపై దృష్టి కేంద్రీకరించడంతో పాటుగా సంపద సృష్టికి ప్రయత్నిస్తుంది. ఈ లక్ష్యానికి మద్దతునందిస్తూ, ఏఎంసీ ఇప్పుడు వివేకవంతంగా తీర్చిదిద్దిన పెట్టుబడి పథకాలను ఈక్విటీలు, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ మరియు లిక్విడ్‌ ఆల్టర్‌నేటివ్స్‌తో అందిస్తుంది. ఇది నిర్వచిత లక్ష్యాలకు అనుగుణంగా పనితీరును అందించడం లక్ష్యంగా చేసుకుంది.