మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 6 జనవరి 2021 (19:28 IST)

ఓరియోబ్రిగేడ్‌లో చేరిన తండ్రీకూతురు ఎంఎస్ ధోని, జీవా

సరదాగా ఉండే అనుబంధాలతో కుటుంబాలు మరింత సన్నిహితం కావడాన్ని ప్రోత్సహించేలా ప్రపంచపు నెం.1, భారతదేశ ఫేవరెట్ కుకీ బ్రాండ్ అయిన ఓరియో తన తాజా క్యాంపెయిన్ ఓరియోప్లేప్లెడ్జ్‌తో ప్రతి ఒక్కరి జీవితంలో వినోదాన్ని మరింతగా జొప్పించే తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటోంది.
 
ఈ క్యాంపెయిన్‌తో ఈ బ్రాండ్ తన ఆలోచనను ఆచరణలో పెట్టింది. తమ హడావుడి జీవనశైలి నుంచి కాస్తంత పక్కకు వచ్చేలా, తాము అభిమానించే వారితో వినోదభరిత క్షణాలను గడపాల్సిందిగా ప్రజలకు స్ఫూర్తినిస్తోంది. తండ్రీకూతుళ్ళ అనుబంధానికి ప్రతీకగా ఉండే భారతీయ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని, ఆయన కుమార్తె జీవా ధోణిలతో ఈ సెంటిమెంట్‌కు జీవం పోస్తోంది. వారి సరదా అనుబంధాన్ని తెరపై అందిస్తోంది ఓరియో.
 
ఈ ప్రచార కార్యక్రమం గురించి మాండలీజ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్- మార్కెటింగ్(బిస్కెట్స్) సుధాంశు నాగ్‌పాల్ మాట్లాడుతూ, ‘‘భారతదేశం అత్యంతగా అభిమానించే బ్రాండ్లలో ఒకటిగా ఓరియో ఎప్పుడూ సరదాను, వినియోగదారుల జీవితాల్లో కలుసుకునే సందర్భాలను పుట్టిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం మధ్య హద్దులు చెరిగిపోతున్న వేళ కుటుంబంతో గడిపే విలువైన క్షణాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అందుకే గడ్డుకాలపు ఏడాదిని చుట్టేశాం. ఎన్నో ఆశలతో 2021లోకి ప్రవేశించాం.
 
ఈ సందర్భంగా జనవరి నెలలో ఓరియో ప్లేప్లెడ్జ్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమం ద్వారా ఓరియో చేసే ప్రయాణం ప్రజల జీవితాల్లో సానుకూలతను జొప్పిస్తుంది. రాబోయే రోజుల్లో తాము ఇష్టపడేవారితో కలసి సరదగా గడిపే క్షణాలను ఏర్పరచుకునేందుకు వినియోగదారులకు స్ఫూర్తినిస్తుంది. ఈ ప్రచార కార్యక్రమం కోసం ఎంఎస్ ధోని, జీవాలను కూడా మేము ప్రచారకర్తలుగా ముందుకు తీసుకువస్తున్నాం. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం, సరదా ధోరణి ఈ క్యాంపెయిన్‌కు ప్రాణం పోసేందుకు, ఓరియో ప్లేఫుల్ ప్లెడ్జెస్‌లో చేరేందుకు మా వీక్షకులకు స్ఫూర్తి కలిగించేందుకు తోడ్పడుతుందని మేం భావిస్తున్నాం’’ అని అన్నారు.
 
ఎంఎస్ ధోని తన అనుభవాలను పంచుకుంటూ, ‘‘జీవాతో మొదటిసారిగా షూటింగ్ నాకెంతో ఆనందదాయక అనుభవాన్ని అందించింది. మేము అభిమానించే కుకీ ఓరియోతో మేము సరదాగా గడిపిన క్షణాలను తెరపై పంచుకోవడం ఎంతో వినోదంగా ఉంటుంది. అందమైన సందేశాన్ని అందించే ఓరియో ప్లేప్లెడ్జ్ నూతన క్యాంపెయిన్ కోసం సెట్ పైన మేం చక్కటి సమయాన్ని వెచ్చించాం. మీరు మీ కుటుంబంతో సరదాగా గడిపేందుకు కాస్తంత సమయాన్ని వెచ్చించే కట్టుబాటును కలిగి ఉండేలా అది మీకు స్ఫూర్తినిస్తుంది. ఇది తండ్రిగా వ్యక్తిగతంగా నేను కూడా ఎదుర్కొన్న సమస్య. సరదాగా గడిపే శక్తితో సానుకూల మార్పు తెచ్చేందుకు ఓరియోతో అనుబంధం ఏర్పరచుకోవడం ఎంతో గొప్పగా భావిస్తున్నాను’’ అని అన్నారు.
 
మాండలీజ్ ఇండియా కోసం పబ్లిసిస్ గ్రూప్ రూపొందించిన ఈ నూతన టీవీసీలో ధోనీ, జీవా ధోనీలు కలిసి ఓ ఆదివారం ఉదయం జీవా తల్లి కోసం ఓ కేక్‌ను తయారు చేస్తుంటారు. అయితే ఈ పని ఓ ట్విస్ట్‌తో పూర్త వుతుంది. కేక్ పైన అలంకరణగా పెట్టే ప్రతీ ఓరియో కుకీతో వారు, ఒకరితో ఒకరు మరింత సమయం వెచ్చించేలా ప్రతిన చేస్తుంటారు. ధోని, జీవాల మధ్య ‘ట్విస్ట్, లిక్, డంక్’తో కూడిన ఈ వినోదాత్మక, సరదా సంభాషణ, ‘మనం ఎంత సరదగా గడుపుతామో, అంతగా మనం కనెక్ట్ అవుతాం’ అనే ఆలోచనను గుర్తుకుతెస్తుంది. ప్రజలు తమ ప్లేఫుల్ ప్లెడ్జ్‌ను OreoPlayPledge డాట్ కామ్ పైన షేర్ చేసుకునేలా స్ఫూర్తినిస్తుంది.
 
ఈ సందర్భంగా లియో బర్నెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఇండియా, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్- సౌత్ ఏషియా రాజ్ దీపక్ దాస్, డిజిటాస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, క్రియేటివ్ హెడ్ మార్క్ మెక్ డొనాల్డ్ మాట్లాడుతూ, లాక్ డౌన్ ఎంతగా వెతలు పెట్టిందో వివరించారు. ఇష్టపడిన వారిని తిరిగి కలుసుకోవడమే గతంలో ఎన్నడూ లేనంత ముఖ్యంగా మారిపోయిందన్నారు. ‘‘ఒకరు మరొకరితో అనుసంధానమయ్యేందుకు ఆటాడుకోవడం అనేది ఓ సార్వత్రిక భాష.
 
మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓరియోతో ‘ప్లే ప్లెడ్జ్’ తీసుకునేలా వారిని ప్రోత్సహిస్తుంది మా క్యాంపెయిన్’’ అని రాజ్ దీపక్ అన్నారు. ‘‘మా వినియోగదారులు తమ పిల్లలతో వినోదాత్మక క్షణాలను గడిపేలా, వాటిని ఆనందించేలా చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఎంఎస్ ధోని, ఆయన కుమార్తె జీవా ఈ సందేశాన్ని అందించేందుకు తగిన ప్రచారకర్తలుగా భావించాం’’ అని మార్క్ అన్నారు.