గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (13:37 IST)

ధోనీని మిస్ అవుతున్నా.. మీటూ అంటూ కోహ్లీ వీడియో వైరల్..

టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని తాను కూడా మిస్ అవుతున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లి చెబుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అభిమానులు వియ్ మిస్ యు ధోనీ ప్లకార్డులు ప్రదర్శించారు. 
 
ఈ సందర్భంగా ఆ అభిమానులను చూస్తూ తాను కూడా ధోనీని మిస్ అవుతున్నట్లు కోహ్లి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఏడాది ఆగస్ట్ 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
మరోవైపు ఆసీస్ క్రికెట్ సిరీస్‌లో భాగంగా కోహ్లీ షాట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఏబీ డివిలియర్స్‌ను గుర్తుకుతెస్తూ ఆడిన షాట్‌ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. టీమిండియా ఇన్సింగ్స్‌ సందర్భంగా కోహ్లి 24 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆండ్రూ టై బౌలింగ్‌లో వికెట్‌ నుంచి పక్కకు జరిగి అచ్చం ఏబీ తరహాలో ఫైన్‌ లెగ్‌ మీదుగా సిక్స్‌ కొట్టాడు. కోహ్లి షాట్‌ చూసి టీమిండియా సహచరులతో పాటు ఆసీస్‌ ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు.
 
కోహ్లి తాను ఆడిన షాట్‌పై మ్యాచ్‌ అనంతరం స్పందించాడు. నేను ఆ షాట్‌ కొట్టిన సమయంలో హార్దిక్‌ నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్నాడు. బహుశా ఆ షాట్‌ ఆడుతానని పాండ్యా కూడా ఊహించి ఉండడు. ఈ షాట్‌ విషయంపై ఏబీకి మెసేజ్‌ చేస్తాను. అచ్చం అతనిలా ఆడానా లేదా అనేది చెప్తాడేమో చూడాలి.  అంతేగాక ఏబీ ఏ విధంగా రిప్లై ఇస్తాడో చూడాలనుందని ' నవ్వుతూ పేర్కొన్నాడు.