సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (10:25 IST)

మెక్‌డొనాల్డ్ నుంచి కొత్త వెర్షన్ శాండివిచ్‌లు

Chicken Burger
మెక్‌డొనాల్డ్ సరికొత్త ప్లాన్స్‌తో ముందుకొచ్చింది. వ్యాపారంలో ముందడుగు వేస్తూ.. ప్రత్యర్థులను చిత్తు చేసేలా మెనూ రూపొందించటంలో ఎప్పుడూ ముందుండే మ్యాక్ డీ... ఇండియన్స్‌కి ఈమధ్య అత్యంత ప్రియమైన ఫాస్ట్ ఫుడ్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా చెయిన్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ స్టోర్స్ ఉన్న మెక్‌డొనాల్డ్ కొత్త రుచులతో మార్కెట్‌ను మరింత కొల్లగొట్టేందుకు రెడీ అయింది. 
 
ఇందులో భాగంగా 3 కొత్త వెర్షన్ శాండివిచ్‌లను లాంచ్ చేయబోతోంది. 1. క్రిస్పీ చికెన్ శాండివిచ్, 2. డీలక్స్ చికెన్ శాండివిచ్, 3. స్పైసీ చికెన్ శాండివిచ్ వెరైటీలను మరికొన్ని రోజుల్లో తన స్టోర్స్‌లో అమ్మబోతోంది. దీనిపై ఇప్పటికే సమాచారం ఇచ్చిన మ్యాక్ డీ... తన మెనూతో బర్గర్ ప్రియులకు గుడ్‌న్యూస్ చెబుతోంది.
 
పికిల్ టాప్స్, ఆలూ రోల్స్ పెట్టి క్రిస్పీ చికెన్ శాండివిచ్‌ని మరింత యమ్మీగా చేస్తోంది. ఇక కొత్త స్పైసీ చికెన్ శాండివిచ్ విషయానికి వస్తే స్పైసీ పెప్పర్ సాస్‌తో మరింత ఘాటు రుచిని ఇస్తోంది.