మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Modified: గురువారం, 27 ఫిబ్రవరి 2020 (05:30 IST)

27-02-2020 రాశి ఫలితాలు: గణేశుని పూజించినా సంకల్పసిద్ధి

మేషం: కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నష్టాన్ని కొంతమేర పూడ్చుకుంటారు. ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. కీలకమైన వ్యవహారాల్లోమీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. స్త్రీలకు సంఘంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
 
వృషభం: ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. కొంతమందిమాట తీరు మీకెంతో ఆవేదన కలిగిస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి వుంటుంది. మీ ఆంతరింగక విషయాలు ఇతరులకు చెప్పడం మంచిది కాదని గ్రహించండి. ఉపాధ్యాయులకు పనిలో చికాకులు తప్పవు. 
 
మిధునం: ఉద్యోగస్తులు పైఅధికారుల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆస్తి పంపకాల్లో సోదరుల మధ్య ఏకీభావం నెలకొంటుంది. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం ఎదుర్కొంటారు. స్త్రీలకు చీటికిమాటికి అసహనం, నిరుత్సాహం వంటి చికాకులు తప్పవు. క్రయవిక్రయాలు ఆశించినంత లాభసాటిగా వుండవు.
 
కర్కాటకం: బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. మీ యత్నాలను నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలలో పనులు చురుకుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. రాజకీయనాయకుల సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
సింహం: ధనం విరివిగా వ్యయమైనా సార్థకత, ప్రయోజనం వుంటుంది. దేనికీ కలిసిరాని మీ కళత్ర వైఖరి నిరుత్సాహపరుస్తుంది. కొత్త షేర్ల కొనుగోళ్లలో పునరాలోచన అవసరం. ధనం విరివిగా వ్యయమైన సార్థకత, ప్రయోజనం వుంటాయి. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. 
 
కన్య: చిరువ్యాపారులకు కలిసరాగలదు. ఉద్యోగస్తులు సహోద్యోగుల ప్రశంసలందుకుంటారు. విద్యార్థినులకు ధ్యేయం పట్ల అవగాహన, కొత్త విషయాలపై ఆసక్తి నెలకొంటాయి. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల అస్వస్థతకు గురవుతారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి.
 
తుల: కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్లుగానే వాయిదా పడతాయి. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి. కొద్దిపాటి ధనసాయం చేసి మీ సంబంధాలు చెడకుండా చూసుకోండి. స్త్రీలు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరిస్తే మంచిది. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. 
 
వృశ్చికం: ప్రియుతముల రాక సమాచారం మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్వూలు, రాత పరీక్షల్లో మెలకువ, ఏకాగ్రత అవసరం. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 
 
ధనస్సు: మీ శ్రీమతి ప్రోత్సహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలుపెడతారు. సోదరీసోదరులతో ఏకీభవించలేకపోతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనలు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. మీ ఆంతరంగిక విషయాలు, వ్యాపార లావాదేవీలు గోప్యంగా వుంచండి. 
 
మకరం: ట్రాన్సుపోర్ట్, ఎక్స్‌పోర్ట్ రంగాల వారికి శుభదాయకం. స్థిరాస్తి విక్రయాల్లో పునరాలోచన అవసరం. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెలకువ అవసరం. ఖర్చులు అధికమవుతాయి. మీ అవసరాలకు కావలసిన ధనం అతి కష్టమ్మీద సర్దుబాటు అవుతుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు.
 
కుంభం: విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. బంధువులు మీ నుంచి ధనం లేక మరేదైనా ప్రతిఫలం ఆశిస్తారు.
 
మీనం: ఏ వ్యవహారం కలిసిరాకపోవడంతో ఆందోళన చెందుతారు. వైద్యులకు ఒడిదుడుకులు తప్పవు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావలసి వుంటుంది. ధన సహాయం, హామీలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి.