వార్షిక బడ్జెట్ 2024 : విత్తమంత్రి కొత్త పన్ను విధానం ఇదే... ఆదా రూ.17500... ఎలా?
కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్ 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పన్ను విధానం ద్వారా వేతన జీవికి రూ.17500 వరకు ఆదా కానుంది. 'స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. కొత్త పన్ను విధానంలో చేసిన మార్పులను పరిశీలిస్తే,
ఈ పన్ను విధానంలో మార్పులు చేసిన ఆర్థిక మంత్రి సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను శాతం ఉండదు. అయితే, రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్నును, రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను, రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను, రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను మేరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు.
అలాగే, మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గించారు. దీంతో మొబైల్ ఫోన్ ధరలు కూడా తగ్గనున్నాయి. 2025 వార్షిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌లో విద్య, ఉద్యోగం, నైపుణ్యం రంగాల కోసం 1.48 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆమె వెల్లడించారు. ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌లో ప్రకటించిన అనేక స్కీమ్‌లు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు మంత్రి సీతారామన్ తెలిపారు.