బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (16:52 IST)

డోనాల్డ్ ట్రంప్ గెలుపు ఎఫెక్ట్ : తగ్గిన బంగారం ధరలు

gold
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ గెలుపు బంగారం ధరలపై కూడా పడింది. ఇటీవల అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్న విషయం తెల్సిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం నేపథ్యంలో బంగారం ధర ఇంకాస్త తగ్గింది. 10 గ్రాముల పసిడి ధర ప్రస్తుతం రూ.76369కి చేరుకుంది. 
 
అమెరికా ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రెండు రోజుల్లోనే ఈ బంగారం ధరల తగ్గుదల రూ.2,100గా ఉంది. భారత మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.76,570గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.74,720గా ఉంది. అలాగే, వెండి ధరల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. కేజీ వెండి ధరపై రూ.4,050 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.90601గా ఉంది. 
 
తమిళనాడుకు తుఫాను ముప్పు... ఏపీ, తెలంగాణాల్లో భారీ వర్షాలు 
 
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారుతుందని, ఈ కారణంగా తమిళనాడు రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచివుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈ కారణంగానే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. 
 
అలాగే, తమిళనాడుకు తుఫాను ముప్పు పొంచివుందని ఐఎండీ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్లకల్లోలంగా మారుతుందని, జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేసింది. ఈ ప్రభావం కారణంగా చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీచేసింది. 
 
అలాగే, తమిళనాడులోని 19 జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.