బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2024 (09:03 IST)

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : వెలువడుతున్న ఫలితాలు.. దూసుకెళుతున్న ట్రంప్

kamal - trump
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా 18 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. దీంతో ఆయనకు 188 ఎలక్టోరల్ సీట్లు లభించినట్లయ్యింది.
 
ఇక, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రస్తుతం 9 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఆమెకు ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్ రాష్ట్రాల్లోని 99 సీట్లు లభించాయి. అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా హారిస్ ఎదురీదుతున్నారు. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లను తీసుకొచ్చింది. అదేసమయంలో పెన్సిల్వేనియాలో మాత్రం కీలకమైన పిటర్‌బర్స్, ఫిలడెల్ఫియాలో ఆమె ముందున్నారు. దీంతో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.