గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 27 మే 2022 (16:25 IST)

ఆటోమోటివ్‌ కియా ఈవీ6ను ఆవిష్కరించిన నటి క్యాథెరిన్ థ్రెసా, రూ. 3 లక్షలు చెల్లించి కారు బుక్ చేస్కోండి

Kia EV6
కియా పూర్తి విద్యుత్‌ ఈవీ6ను హైటెక్‌ సిటీ ఆటోమోటివ్‌ కియా వద్ద ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నటి క్యాథెరిన్‌, సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌‌తో పాటుగా కియా ప్రతినిధులు రఘు, గౌతమ్‌; షోరూమ్‌ ప్రతినిధి చెన్నకేశవ- సీఓఓ; వరప్రసాద్‌-జీఎం పాల్గొన్నారు. ఈ వాహనాన్ని కొండాపూర్‌లో ఉన్న ఆటోమోటివ్‌ కియా, హైటెక్‌ సిటీ వద్ద ప్రదర్శిస్తున్నారు.

 
ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఈ గేమ్‌ ఛేంజింగ్‌ కారును ప్రత్యక్షంగా చూడవచ్చు. మూడు లక్షల రూపాయల టోకెన్‌ ఎమౌంట్ చెల్లించడం ద్వారా ఈ వాహనాన్ని ముందుగా బుక్‌ చేసుకోవచ్చు. భారతదేశంలో ప్రీమియం ఆఫరింగ్‌గా 2022లో 100 మంది వినియోదారులకు ముందుగా వచ్చిన వారికి ముందు పద్ధతిలో ఈవీ6ను డెలివరీ చేయనున్నారు. ఈ వాహనాన్ని జూన్‌ 2022లో విడుదల చేయనున్నారు.

 
దేశంలో కియా ఈవీ ప్రయాణారంభానికి ప్రతీకగా నిలిచే ఈవీ6ను ఈ-జీఎంపీపై నిర్మించారు. అత్యంత వేగవంతమైన చార్జింగ్‌, అసాధారణ పనితీరుల సమ్మేళనంగా ఉంటుంది. ఈవీ 6 ఇండియా వెర్షన్‌లో 77.4 కిలోవాట్‌ హవర్‌ లిథయం అయాన్‌ బ్యాటరీ ఉంది. ఇది 229 పీఎస్‌ విద్యుత్‌ శక్తిని 2డబ్ల్యుడీలో ఉత్పత్తి చేయడంతో పాటుగా ఏడబ్ల్యుడీ వేరియంట్‌లో 325 పీఎస్‌ శక్తిని విడుదల చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 528 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుంది.

 
కియా ఈవీ6లో సౌకర్యవంతమైన ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. వెడల్పాటి ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, డ్రైవర్‌, ప్యాసెంజర్‌ రిలాక్సేషన్‌ సీట్లు, రిమోట్‌ ఫోల్డింగ్‌ సీట్లు, ఏఆర్‌ హెడ్‌ అప్‌ డిస్‌ప్లే వంటివి దీనిలో ఉన్నాయి. భద్రతాపరంగా 8 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా దీనిలో ఉన్నాయి. కియా ఈవీ 6 వాహనం భారతదేశంలో ఐదు రంగులలో లభిస్తుంది. మూన్‌స్కేప్‌, స్నో వైట్‌ పెరల్‌, రన్‌వే రెడ్‌, అరోరా బ్లాక్‌ పెరల్‌, యాచ్‌ బ్లూ-లో లభిస్తుంది.