శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మే 2022 (20:00 IST)

అదిరిపోయే ఫీచర్లతో కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారు - ధర ఎంతంటే?

kia ev6
భారతీయ కార్ల తయారీ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన అనతికాలంలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కియా మోటార్స్ ఇపుడు అదిరిపోయే ఫీచర్లతో ఈవీ-6 పేరుతో ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ కారును వచ్చే నెల రెండో తేదీన గ్రాండ్‌గా లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కియా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ కార్లను బుక్ చేసుకోవచ్చు. అయితే టోకెన్ అడ్వాన్స్‌గా మూడు లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. 
 
ఈ ఎలక్ట్రిక్ కారులో 77.4 కిలోవాట్‌ల బ్యాటరీని అమర్చారు. సింగిల్ చార్జితో 528 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేయొచ్చు. 5.2 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 192 కిలోమీటర్లు. అయితే, కియా ఈవీ 6 ధర రూ.60 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఈ కారుకు అమర్చే బ్యాటరీ కేవలం 80 నిమిషాలు అంటే ఒకటిన్నర గంటలోనే ఫుల్ చార్జ్ అవుతుందని కియా యాజమాన్యం చెబుతోంది. 
 
అలాగే, లార్జ్ బూట్ స్పేస్, పెద్దదైన సన్ రూఫ్, ఎల్లాయ్ వీల్స్, అధునాత టెయిల్ ల్యాంప్ సిస్టమ్, లేటెస్ట్ ఇన్ఫోంటైన్ సిస్టమ్. ఆగ్యుమెంటెడ్ రియాల్టీ హెడ్ అప్ డిస్‌ప్లే, ఆల్‌వీల్ డ్రైవ్, నార్మల్, స్పోర్ట్స్, ఎకో డ్రైవింగ్ మోడ్స్, ఈవీ రిమోట్ చార్జింగ్ కంట్రోల్, సరౌండ్ వ్యూ మానిటరింగ్, ఈవీ రిమోట్ క్లైమేట్ కంట్రోల్ వంటి అత్యాధునిక ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.