థాయ్ ఓపెన్‌లో సత్తాచాటుతున్న పీవీ సింధు - యమగూచి చిత్తు
తెలుగుదేశం, భారత షట్లర్ పీవీ సింధు థాయ్‌లాండే వేదికగా జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్ 2022లో ప్రపంచ నంబర్ వన్ జపాన్‌కు చెందిన అకానె యమగూచిని చిత్తు చేసింది. ఫలితంగా పీవీ సింధు సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో యమగూచిని 21-15, 20-22, 21-13 తేడాతో మట్టికరిపించింది.
తొలి గేమ్‌ను సింధు కైవసం చేసుకోగా, రెండో గేమ్‌లో యమగూచి జోరును ప్రదర్శించి గేమ్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఫలితాన్ని నిర్ణయించే మూడో గేమ్‌లో యమగూచి వెన్ను నొప్పితో ఇబ్బందిపడటంతో ఇదే అదునుగా భావించిన పీవీ సింధు అద్భుతంగా ఆడి మూడో గేమ్‌ను 21-13 తేడాతో సొంతం చేసుకుంది. సెమీస్‌లో చైనాకు చెందిన ఒలింపిక్స్ చాంపియన్ చెన్ యూ ఫీతో పీవీ సింధు తలపడనున్నారు.