1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (17:46 IST)

పీవీ సింధుకు ఐస్‌క్రీం తినిపించిన ప్రధాని మోదీ

PV sindhu
ప్రధాని నరేంద్ర మోదీ మాట నిలబెట్టుకున్నారు. ముందే చెప్పినట్టుగా బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధుకు ఐస్‌క్రీం తినిపించారు. భారతీయుల వందేళ్ల కల నెరవేర్చిన బల్లెం వీరుడు, నీరజ్‌ చోప్రాకు ప్రధాని మోదీ చుర్మా రుచి చూపించారు. స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా...ఢిల్లీ లోక్ కల్యాణ్‌మార్గ్‌లో....తన అధికారిక నివాసానికి వచ్చిన అథ్లెట్లను మోదీ ప్రత్యేకంగా పలకరించారు. 
 
ఒలింపిక్స్‌ అథ్లెట్లకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. క్రీడాకారుల విజయాలను, వారి కృషిని ప్రశంసించారు మోదీ. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లేముందు అథ్లెట్లతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి అప్పుడు ప్రస్తావించారు ప్రధాని మోదీ. మున్ముందు మరింత బాగా రాణించాలని సూచించారు. ఈ క్రమంలో క్రీడాకారులతో కలిసి ప్రధాని ఫొటోలు దిగారు.