సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (09:13 IST)

సింహాచలం ఆలయంలో పీవీ సింధూ

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని బాడ్మింటన్ సెన్సేషన్   పీవీ సింధూ దర్శించుకున్నారు. తన తండ్రితో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమెను ఈ సారి ఒలింపిక్స్ లో గోల్డ్ తీసుకురావాలని అర్చకులు ఆశీర్వదించారు.

సింధూకు అధికారులు స్వాగతం పలికి... ప్రసాదం, వేద ఆశీర్వాదం అందించారు. ఆమెను సత్కరించారు. రెండు వరుస ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన తొలి ఇండియన్ గా రికార్డు సృష్టించిన ఆమె.. మూడోసారి మెడల్ సాధిస్తానన్నారు.

సింహాచలం క్షేత్ర మహత్స్యాన్ని, స్వామివారి వైభవాన్ని పీవీ సింధుకు అర్చకులు, అధికారులు వివరించి చెప్పారు.