ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 5 జులై 2017 (03:00 IST)

ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానంలో రికార్డు బద్దలు.. 7.36 కోట్ల మంది పాటించారు

ఆదాయ పన్ను రిటర్న్‌ల ఈ–ఫైలింగ్‌ కోసం జూలై 1 నుంచి ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం చేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 7.36 కోట్ల మంది పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (పాన్‌) హోల్డర్లు తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేస

ఆదాయ పన్ను రిటర్న్‌ల ఈ–ఫైలింగ్‌ కోసం జూలై 1 నుంచి ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం చేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 7.36 కోట్ల మంది పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (పాన్‌) హోల్డర్లు తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. ఒక్క జూన్ నెలలోనే ఏకంగా ఒక కోటి మంది పైగా అనుసంధానం చేసుకున్నట్లు ఆదాయ పన్ను విభాగం అధికారి వివరించారు.
 
ప్రస్తుతం మొత్తం 30 కోట్ల పైచిలుకు పాన్‌ హోల్డర్లు ఉండగా,  దాదాపు 115 కోట్ల మంది ప్రజానీకానికి ఆధార్‌ నంబర్లు కేటాయించడం జరిగింది. ఆదాయ పన్ను రిటర్న్‌ల ఈ–ఫైలింగ్‌ కోసం జూలై 1 నుంచి ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం చేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.