1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2022 (11:59 IST)

LPG గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది.. దసరాకు ముందు గుడ్ న్యూస్

lpg cylinder
LPG గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. చిరు వ్యాపారులు, హోటల్స్, టిఫిన్ సెంటర్స్, బేకరీ వంటి ఇతర దుకాణాల నిర్వాహకులకు ఊరటనిస్తూ.. కమర్షియల్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు తగ్గించాయి. దీంతో దసరాకు ముందు చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ వచ్చినట్లైంది.

వాణిజ్య సిలిండర్ ధర తగ్గడం ఇది వరుసగా ఆరోసారి. మే నెలలో రికార్డు స్థాయిలో రూ.2354కి చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తోంది.  సెప్టెంబరు 1న 91.50 రూపాయలు తగ్గించగా.. ఈ నెలలో మాత్రం  25.50 మేర దిగొచ్చింది. 
 
ఇకపోతే.. అక్టోబరు 1న ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన ధరల ప్రకారం.. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటు రూ.25.50 తగ్గింది. 9 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర.. ఢిల్లీలో రూ.25.50, కోల్‌కతాలో రూ.36.50, ముంబైలో రూ.35.50, హైదరాబాద్‌లో 36.5 తగ్గింది. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్‌కు రూ.1885 చెల్లించాలి. గతంలో దీని ధర రూ.1976.50గా ఉండేది.