సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (10:00 IST)

వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు ఊరట..

gas cylinder
దేశంలో వాణిజ్య సిలిండర్లను వినియోగించేవారికి చమురు కంపెనీలు స్వల్ప ఊరట కలిగించాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరపై రూ.83.50 మేరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. పైగా, తగ్గించిన ధరలు కూడా గురువారం నుంచే  అమల్లోకి వచ్చాయి. అయితే, 14.2 కేజీల గృహ వినియోగదారుల సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ చేయలేదు. 
 
తాజా తగ్గింపుతో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1856.50గా ఉంది. అలాగే, కోల్‍‌కతాలో దీని ధర రూ.1875.50గా ఉంది. ముంబైలో ఈ ధర రూ.1725గాను, చెన్నైలో రూ.1937గా ఉంది. కాగా, ఈ యేడాది మార్చి నెల ఒకటో తేదీన వాణిజ్యం సిలిండర్ ధరపై రూ.350.50, సాధారణ సిలిండర్ ధరపై రూ.50 చొప్పున వడ్డించిన విషయం తెలసిందే. 
 
ఆ తర్వాత నుంచి సిలిండర్ ధరలను తగ్గించుకుంటూ వసస్తున్నారు. గత ఏప్రిల్ నెలలో వాణిజ్యం సిలిండర్ ధరపై దాదాపుగా రూ.200 మేరకు తగ్గించిన విషయం తెల్సిందే. ఇపుడు మరోమారు వాణిజ్యం సిలిండర్ ధరను తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు, పెట్రోల్, డీజల్ ధరలను గత రెండు నెలలుగా స్థిరంగా ఉంచాయి.