గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 మే 2023 (17:28 IST)

తెలంగాణాలో టీఎస్ సీపీజీసెట్ నోటిఫికేషన్ రిలీజ్

tscpget2023
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోని పోస్ట్ గ్యాడ్యుయేట్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లోని సీట్ల భర్తీ కోసం ప్రతి యేటా నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీ సీపీజీసెట్‌ 2023 నోటిఫికేషన్‌ను ఆ రాష్ట్ర ఉన్నత విద్యాండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి మరికొందరు ఉన్నతాధికారులతో కలిసి రిలీజ్ చేశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, మహిళా విశ్వవిద్యాలయాల్లో ఉన్న సీట్లను సీపీగెట్ (ts cpget) ద్వారా అడ్మిషన్లు కల్పించనున్నారు. 
 
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 12వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆలస్య రుసుం రూ.500తో జూన్ 18వ తేదీ వరకు రూ.2 వేల ఆలస్య రుసుంతో జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. 
 
సీపీగెట్ పరీక్ష జూన్ ఆఖరివారంలో జరుగనుంది. ఈ విశ్వవిద్యాలయాల్లోని ఎంఏ, ఎమ్మెల్సీ, ఎంకామ్, ఎమ్మెస్సీ సంప్రదాయ కోర్సుల్లోని సీట్లను భర్తీ చేస్తారు. పూర్తి వివరాల కోసం osmania.ac.in, cpget.tsche.ac.in, ouadmissions.com వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సీపీగెట్‌ కన్వీనర్‌ తెలిపారు.