1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 8 ఆగస్టు 2023 (22:17 IST)

మోజ్ సింగింగ్ స్టార్స్: భారతదేశపు అతిపెద్ద షార్ట్ వీడియో యాప్ మీకోసం అద్భుతమైన మ్యూజికల్ షోడౌన్

image
భారతదేశపు అతిపెద్ద షార్ట్ వీడియో యాప్ అయినటువంటి మోజ్ ఆగస్ట్ 7న మోజ్ సింగింగ్ స్టార్స్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆసక్తిగా తిలకించేందుకు అభిమానులంతా సిద్ధంగా ఉండండి. మోజ్ ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 7 నుంచి ఆగస్ట్ 13 వరకు నిర్వహించనుంది. వారం పాటు నిర్వహించనున్న ఈ గాన సమరంలో అద్భుతమైన సంగీత ప్రదర్శనను తిలకించేందుకు సిద్ధంగా ఉండండి. ఈ గాన సమరంలో దేశవ్యాప్తంగా ఉన్న క్రియేటర్స్ తమ సింగింగ్ టాలెంట్ ను మూడు రౌండ్లలో ప్రదర్శించి అద్భుతమైన నగదు బహుమతుల కోసం పోటీపడతారు. రాత్రి 7:00 గంటలకు జరిగే ప్రతి రౌండ్‌తో, ఓల్డ్ స్కూల్ సాంగ్స్, ప్రేక్షకులు ఎంపిక చేసిన పాటలు, 90ల నాటి పాటలు  వర్సెస్ 2000ల నాటి థీమ్‌లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ సింగింగ్ టాలెంట్ పైనల్ స్టేజ్ కు వచ్చినప్పుడు మరింత ఉత్సాహం పెరుగుతుంది. వర్చువల్ గా బహుమతులు అందించే ఈ కార్యక్రమంలో మోజ్ వీక్షకులు తమ అభిమాన క్రియేటర్స్ కు మద్దతు ఇవ్వవచ్చు. వారిని గెలిపించేందుకు ఒక అడుగు ముందుకు వేయవచ్చు.
 
ఈ క్యాంపెయిన్ గురించి మోజ్ అండ్ షేర్ చాట్  సీనియర్ డైరెక్టర్, కంటెంట్ శ్రీ శశాంక్ శేఖర్ మాట్లాడుతూ... "సంగీత ఔత్సాహికులను మరియు ప్రేక్షకులను ఏకం చేసేందుకు ప్రత్యక్ష సంగీత కార్యక్రమం కంటే గొప్ప మార్గం మరోకటి లేదు. మోజ్ సింగింగ్ స్టార్స్ మా అసాధారణమైన సంగీత దృశ్యాన్ని ఆవిష్కరించింది. క్రియేటర్స్ మిమ్మల్ని మరచిపోలేని ప్రయాణంలో నడిపిస్తారు. భారతదేశం యొక్క అత్యంత ప్రియమైన సింగింగ్ సన్షేషన్ బిరుదు కోసం ఇక్కడ పోటీ పడతారు. మోజ్‌ ద్వారా మేము ఎల్లప్పుడూ యువత తమ ప్రతిభను చాటుకోవడానికి ఒక సమగ్రమైన స్థలాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాము. డిజిటల్ మ్యూజిక్ సూపర్‌స్టార్‌లుగా చెరగని ముద్ర వేస్తూ, మ్యాజిక్ కంటెంట్ క్రియేటర్స్ గా ఆవిర్భవించడానికి ఈ ప్రచారం అద్భుతమైన ప్లాట్‌ఫామ్ ను అందిస్తుంది అని అన్నారు ఆయన.
 
మొదటి రౌండ్, చిన్ననాటి సంగతులు- ఈ థీమ్.. 3 రోజుల పాటు అంటే ఆగస్ట్ 7 నుండి 9 వరకు జరుగుతుంది. ఇక్కడ క్రియేటర్స్ చిన్ననాటి పాటలతో వీక్షకులను తమ చిన్ననాటి ఊహల ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. పాటలకు సంబంధించిన తమ చిన్ననాటి సంగతులను కూడా ఈ థీమ్ లో పంచుకుంటారు. 1500కి పైగా లైవ్ స్ట్రీమ్‌లతో పోటీ పడుతూ, ప్రేక్షకుల నుండి గరిష్టంగా వర్చువల్ బహుమతులను స్వీకరించే టాప్ 100 క్రియేటర్స్ నెక్స్ట్ రౌండ్‌కు చేరుకుంటారు.
 
ఫర్మాయిష్/పాట అభ్యర్థన థీమ్‌- ఇది రెండో రౌండ్. ఈ రౌండ్లో భాగంగా, క్రియేటర్స్ తమ పాటను ఎంచుకోవడానికి వీక్షకులకు అవకాశం ఇస్తారు. ఆగస్ట్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. ప్రేక్షకులు అభ్యర్థించిన పాట కావడంతో పోటీదారులు ఈ పాటల పోటీల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారు. ప్రేక్షకులు తమకు నచ్చిన గాయకుడికి వర్చువల్ బహుమతులు పంపడం ద్వారా దానిని బాగా పాడిన క్రియేటర్స్ నిర్ణయిస్తారు. దాదాపు 400+ లైవ్ స్ట్రీమ్‌ల తర్వాత, టాప్ 100 క్రియేటర్‌లు చివరి రౌండ్‌కి వెళతారు.
 
ఆగస్టు 13న జరిగే మూడో మరియు చివరి రౌండ్‌లో, క్రియేటర్స్ 90ల పాటలు వర్సెస్ 2000ల నాటి పాటల యుద్ధంలో పాల్గొంటారు. 100కి పైగా లైవ్ స్ట్రీమ్‌లలో, క్రియేటర్‌లు తమకు ఇష్టమైన సూఫీ, బాలీవుడ్ నంబర్‌లను పాడతారు. అయితే ఈ ఆఖరి యుద్ధంలో ఏ క్రియేటర్స్ గెలుపొందుతారో వీక్షకులు నిర్ణయిస్తారు.
 
ఇక క్యాంపెయిన్ ముగింపులో, అద్భుతంగా పాడిన వారికి, అత్యధిక బహుమతులు వచ్చిన క్రియేటర్స్ విజేతలుగా ప్రకటించబడతారు. ఇంకా, రౌండ్‌లలోని అగ్రశ్రేణి బహుమతులు అందుకున్న వాళ్లు మధ్యమధ్యలో తమ బహుమతులపై క్యాష్‌బ్యాక్‌ను స్వీకరించే అవకాశం ఉంటుంది. దీనిద్వారా క్రియేటర్స్ మరియు బహుమతులు ఇచ్చినవాళ్లు కూడా బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది.
 
మోజ్ లైవ్ అనేది ఒక అద్భుతమైన వేదికగా, ఎంతోమందికి వినోదాన్ని మరియు అవకాశాలను అందిస్తున్న వేదికగా అభివృద్ధి చెందింది. క్రియేటివ్ ఆధారిత పోటీలతో, క్రియేటర్స్ తమ పరిధిని మరియు తమ అవకాశాలను మరింతగా పెంచుకోవచ్చు. అంతేకాకుండా వర్చువల్ బహుమతి అవకాశాల ద్వారా వారి ఆదాయాలను పెంచుకోవచ్చు. గతంలో మోజ్ ద్వారా తమ ప్రతిభను చాటుకున్న ప్రతిభావంతులు సోనీ మ్యూజిక్ ఇండియా, టిప్స్, యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్, సారెగామా మరియు వార్నర్ మ్యూజిక్‌మేకింగ్ వంటి ప్రఖ్యాత రికార్డ్ లేబుల్‌లతో కలిసి పనిచేసే అవకాశాలను అందుకున్నారు.
 
మీరు అద్భుతంగా పాట పాడ గలిగితే..., ఈ అంతిమ మ్యూజికల్ షోడౌన్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండండి. అలాగే మీ నైపుణ్యాన్ని ప్రదర్శించండి. వీక్షకుడిగా, మీకు ఇష్టమైన గాన ప్రతిభకు మద్దతు ఇవ్వండి. అంతిమ విజేతగా ఎవరు నిలుస్తారో తేల్చేందుకు ఈ సంగీత మహోత్సవాన్ని ఆస్వాదించండి.