గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 26 సెప్టెంబరు 2022 (23:29 IST)

టెమాసెక్‌ నుంచి 85 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పొందినట్లు వెల్లడించిన మొల్బియో డయాగ్నోస్టిక్స్‌

Cash
గోవా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న మొల్బియో డయాగ్నోస్టిక్స్‌ అత్యున్నత నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడానికి వినూత్నమైన పరిష్కారాలను అందిస్తుంటుంది. అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టే టెమాసెక్‌ తమ సంస్ధలో 85 మిలియన్‌ డాలర్ల  పెట్టుబడులను పెట్టినట్లుగా మొల్బియో డయాగ్నోస్టిక్స్‌ వెల్లడించింది.
 
విప్లవాత్మకమైన  ట్రూనాట్‌ సాంకేతికతకు సుపరిచితమైనది మొల్బియో. ట్రూ నాట్‌ అనేది పాయింట్‌ ఆఫ్‌ కేర్‌, పోర్టబల్‌, బ్యాటరీ ఆపరేటెడ్‌ రియల్‌ టైమ్‌ పీసీఆర్‌ ప్లాట్‌ఫామ్‌. అత్యంత ప్రభావవంతమైన, విప్లవాత్మక ఆవిష్కరణగా  ట్రూ నాట్‌ను అంతర్జాతీయంగా ప్రశంసించారు. ప్రపంచంలో మొట్టమొదటి పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ మాలిక్యులర్‌ డయాగ్నోస్టిక్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రూనాట్‌. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యుహెచ్‌ఓ) సైతం  ట్యూబర్‌క్యులోసిస్‌ (క్షయ) వ్యాధి నిర్ధారణలో స్మియర్‌ మైక్రోస్కోపీకి  ప్రత్యామ్నాయంగా గుర్తించింది. ఈ సాంకేతికతను ఆరోగ్య సంరక్షణ రంగంలో అన్ని దశలలోనూ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆఖరకు అతి  మారుమూల ప్రాంతాలు, సులభంగా వెళ్లలేని ప్రాంతాలలో సైతం ఇది అందుబాటులో ఉంది. దీనిద్వారా అత్యంత వేగంగా, ఖచ్చితంగా అంటువ్యాధులు గుర్తించడం వీలవుతుంది. తద్వారా సమయానికి, తగిన చికిత్సను అందించడమూ వీలవుతుంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై 40కు పైగా వ్యాధులను గుర్తించవచ్చు. అలాగే టీబీ,  కొవిడ్‌-19, హెపటైటిస్‌, హెచ్‌ఐవీ, హెచ్‌పీవీ, దోమల వల్ల వచ్చే డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా సైతం గుర్తించవచ్చు.
 
అత్యున్నత ప్రశంసలు పొందిన ట్రూ నాట్‌ రియల్‌ టైమ్‌ పీసీఆర్‌ ను ప్రపంచవ్యాప్తంగా 40కు పైగా దేశాలలో 5వేలకు పైగా టెస్టింగ్‌ కేంద్రాల వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. భారతప్రభుత్వం ఈ పరికరాలను ప్రాధమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల వద్ద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో  జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతర్జాతీయంగా ట్రూనాట్‌ ను టీబీ పరీక్షల కోసం వినియోగించడం ప్రారంభించారు. యునైటెడ్‌ నేషన్స్‌, యుఎస్‌ ఎయిడ్స్‌, గ్లోబల్‌ ఫండ్స్‌, గ్లోబల్‌ డ్రగ్‌ ఫెసిలిటీ మొదలైనవ వాటితో సహా పలు సంస్ధలు దీనిని వినియోగిస్తున్నాయి. కొవిడ్‌ 19కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తోన్న పోరాటంలో కూడా ట్రూ నాట్‌ అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. గ్రామీణ ప్రాంతాలతో పాటుగా పరిమిత వనరులు కలిగిన దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేరుకునేందుకు ఇది తోడ్పడింది.
 
ప్రస్తుత మదుపరులు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఆల్టర్నేటివ్స్‌తో పాటుగా టెమాసెక్‌ ఇప్పుడు మా మదుపరుల జాబితాలో చేరడంతో టెమాసెక్‌ ఇప్పుడు క్లీనికల్‌ అవసరాలలో అంతరాల ఆధారంగా నియర్‌కేర్‌ టెక్నాలజీస్‌లను అభివృద్ధి చేసి వాణిజ్యీకరించడానికి కంపెనీ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది మరియు వేగవంతం చేస్తుంది. అంతేకాదు, అంతర్జాతీయ మార్కెట్‌లకు ట్రూ నాట్‌ ప్లాట్‌ఫామ్‌ను తీసుకువెళ్లాలనే కంపెనీ ప్రయత్నాలను సైతం వేగవంతం చేస్తుంది.
 
మొల్బియో డయాగ్నోస్టిక్స్‌ డైరెక్టర్‌ మరియు సీఈఓ శ్రీ శ్రీరామ్‌ నటరాజన్‌ మాట్లాడుతూ, ‘‘ మాతో టెమాసెక్‌ చేతులు కలపడం పట్ల సంతోషంగా ఉన్నాము.  అత్యున్నత నాణ్యత కలిగిన, పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ మాలిక్యులర్‌ డయాగ్నోస్టిక్‌ సిస్టమ్స్‌ కోసం గతానికంటే డిమాండ్‌ ఇప్పుడు అధికంగా ఉంది. టెమాసెక్‌తో  వ్యూహాత్మక భాగస్వామ్యం, అంతర్జాతీయంగా ఆరోగ్య సంరక్షణ సవాళ్లను పరిష్కరించేందుకు తగినట్లుగా నిలకడతో కూడిన  అవకాశాలను అందించేందుకు తోడ్పడనుంది’’ అని అన్నారు.
 
ఈ పెట్టుబడులను గురించి మొల్బియో డయాగ్నోస్టిక్స్‌ డైరెక్టర్‌ మరియు సీటీఓ డాక్టర్‌ చంద్రశేఖర్‌ నాయర్‌ మాట్లాడుతూ ‘‘ టెమాసెక్‌తో మా భాగస్వామ్యంతో , ప్రపంచ వ్యాప్తంగా వ్యాధి నిర్ధారణ పరంగా ఉన్న అత్యంత కీలకమైన అంతరాలను పరిష్కరించడంలో నూతన సాంకేతికతలను తీసుకురావాలనే మా ప్రయత్నాలు  మరింత వేగవంతం చేయడం సాధ్యమవుతుంది’’ అని అన్నారు.
 
మోతీలాల్‌ ఓస్వాల్‌ ఆల్టర్నేటివ్స్‌ డైరెక్టర్‌ రోహిత్‌ మంత్రి మాట్లాడుతూ, ‘‘గత మూడు సంవత్సరాలుగా, మొల్బియో డయాగ్నోస్టిక్స్‌, భారతదేశంలో వ్యాధి నిర్దారణ తీరును గణనీయంగా మార్చడంతో  పాటుగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడడంలో వాస్తవ ప్రభావాన్ని చూపింది. ఆవిష్కరణలకు అసలైన ప్రతిరూపం మొల్బియో. ప్రపంచం కోసం భారతదేశం నిలిచేలా చేసింది. కొవిడ్‌కు కొద్ది నెలలకు ముందు మేము మొల్బియోతో భాగస్వామ్యం చేసుకున్నాము. ఆ సమయంలో  వారికి క్యాపిటల్‌ అత్యవసరం. అనంతర కాలంలో భారతదేశంలో టెస్టింగ్‌ మౌలికవసతులు పరంగా అత్యంత కీలకమైన పాత్రను మొల్బియో పోషించడంతో పాటుగా తమ టెస్టింగ్‌ మౌలిక సదుపాయాలు గణనీయంగా పెంచుకోగలిగింది. ఇప్పుడు ఈ సంస్ధ అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండటం చేత మేము పూర్తి ఆసక్తికరంగా ఉన్నాము మరియు మొల్బియో యొక్క వృద్ధి ప్రయాణంలో టెమాసెక్‌ను స్వాగతిస్తున్నాము’’ అని అన్నారు